సాధారణంగా టైమ్ టు టైమ్ పీరియడ్స్( Periods ) వస్తే ఎలాంటి సమస్య ఉండదు.కానీ కొందరిలో నెలసరి అనేది చాలా ఆలస్యం అవుతుంది.
మామూలుగా 28 రోజులకే నెలసరి వస్తుంది.కొందరికి మాత్రం 40 రోజులు దాటిన నెలసరి రాదు.
లేదా 40 రోజుల లోపు ఎప్పుడైనా రావచ్చు.ఎప్పుడు వస్తుందో తెలియని పీరియడ్స్ కారణంగా బయటకు వెళ్లాలంటేనే భయపడతాడు.
ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న వారిలో పీరియడ్స్ ఆలస్యమైన పెద్దగా ఆందోళన ఉండదు.కానీ మిగిలిన వారు మాత్రం ఎంతో ఇబ్బంది పడుతుంటారు.
అయితే నెలసరి ఆలస్యం కావడానికి కారణాలు అనేకం.

అకస్మాత్తుగా బరువు తగ్గడం, బరువు అధికంగా ఉండటం, అధిక ఒత్తిడి, అతిగా వ్యాయామం చేయడం, మెనోపాజ్( Menopause ), గర్భ నిరోధక మాత్రలు వాడడం, పీసీఓఎస్, డయాబెటిస్ అదుపులో లేకపోవడం, హైపర్ థైరాయిడ్ తదితర కారణాల వల్ల నెలసరి ఆలస్యం అవుతూ ఉంటుంది.మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా.? ప్రతిసారి నెలసరి మరీ ఆలస్యంగా వస్తుందా.? అయితే ఆందోళన వద్దు.నిజానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
ముఖ్యంగా అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.మీ నెలసరి సమయానికి వారం రోజులు ముందు నుంచి నిత్యం ఈ డ్రింక్ ను తీసుకుంటే కరెక్ట్ టైమ్ కి పీరియడ్ వస్తుంది.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ లైట్ గా దంచిన నువ్వులు వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ శొంఠి పొడి( Sonti Podi ) వేసుకొని కనీసం 10 నుంచి 12 నిమిషాల పాటు మరిగించాలి.

వాటర్ ఆల్మోస్ట్ సగం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము కలిపి సేవించాలి.నెలసరి సమయానికి వారం రోజుల ముందు నుంచి నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవాలి.ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య( Irregular Periods )తో బాధపడుతున్న వారికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.
టైమ్ టు టైమ్ నెలసరి వచ్చేందుకు ఈ డ్రింక్ ఎంతగానో తోడ్పడుతుంది.