కరోనా వైరస్ కంటికి కనిపించకపోయినా ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే.ఈ మహమ్మారి వణికిస్తుండగానే వర్షాకాలమూ వచ్చేసింది.
ఈ సీజన్‌లో అంటు వ్యాధులు, విష జ్వరాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇలా ఎన్నో ఇబ్బంది పెడుతుంటాయి.వీటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా ఉండాలి.
అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని కొన్ని ఆహారాలను తీసుకుంటే సమర్థవంతంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.మరి ఆ ఆహారాలు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి ఆకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో జబ్బులను నివారింస్తుంది.అలాగే ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలోనూ సహాయపడుతుంది.ఒక గ్లాస్ వాటర్‌లో మూడు లేదా నాలుగు తులసి ఆకులను వేసి రాత్రంతా నాన బెట్టి ఉదయాన్నే ఆ నీటిని మరిగించి ఖాళీ కడుపుతో సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అంటు వ్యాధులు, వైరస్‌లు దరి చేరకుండా ఉంటాయి.

అలాగే వెల్లుల్లి కూడా ఇమ్యూనిటీని పెంచగలదు.ఒక గ్లాస్ వాటర్‌లో క్రష్ చేసిన మూడు వెల్లల్లి రెబ్బలు, చిటికెడు లవంగాల పొడి చేసి బాగా మరిగించాలి.ఆ తర్వాత నీటిని వడబోసుకుని కొద్దిగా తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి.
లేదా డైరెక్ట్‌గా వెల్లుల్లి రెబ్బలను నమిలి తినొచ్చు.ఇలా ఎలా చేసినా రోగనిరోధక శక్తిని అమాంతం పెరుగుతుంది.
మరియు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో ఒక స్పూన్ ఉసిరి తరుము కలిపి ఖాళీ కడుపుతో తీసుకుంట .ఇమ్యూనిటీ పవర్ సూపర్‌గా పెరుగుతుంది.అలాగే వెయిట్ లాస్ అవుతారు.
కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.కీళ్ల నొప్పులు తగ్గు ముఖం పడతాయి.
మరియు గుండె జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.