అంతర్జాతీయ విద్యార్ధులకు భారత్ శుభవార్త .. కొత్తగా రెండు స్పెషల్ వీసాలు

ఇండియాలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటున్న విదేశీ విద్యార్ధులు, ఎన్ఆర్ఐ విద్యార్ధులకు ( foreign students, NRI students )భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఇందుకోసం రెండు స్పెషల్ కేటగిరీ వీసాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

 Indian Govt Launches 2 Special Category Visas For International Students , Stude-TeluguStop.com

‘ఈ- స్టూడెంట్ వీసా ’, ‘ ఈ- స్టూడెంట్ – x ’ వీసాలను హోం మంత్రిత్వ శాఖ తాజాగా ప్రవేశపెట్టింది.దరఖాస్తుదారులంతా ప్రభుత్వం ప్రారంభించిన స్టడీ ఇన్ ఇండియా (ఎస్ఐఐ) పోర్టల్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.

ఎస్ఐఐ పోర్టల్‌లో( SII portal ) నమోదు చేసుకున్న అర్హత గల విదేశీ విద్యార్ధులు ఈ స్టూడెంట్ వీసా సదుపాయాన్ని పొందొచ్చని అలాగే ఈ స్టూడెంట్ వీసాలు కలిగి ఉన్న వారిపై ఆధారపడిన వారిపై ఈ – స్టూడెంట్ – x వీసాను మంజూరు చేస్తామని వెల్లడించింది.ఎస్ఐఐ పోర్టల్‌ను భారత్‌లో దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక కోర్సులను అభ్యసించాలని అనుకునే అంతర్జాతీయ విద్యార్ధుల ప్రవేశ ప్రక్రియను సులభతరం చేస్తుంది.

Telugu Foreign, Indian Launches, Indianlaunches, International, Nri, Sii Website

విద్యార్ధులు https://indianvisaonline.gov.in/ పోర్టల్‌లో విడిగా దరఖాస్తు చేసుకోవాలి.కానీ వారి దరఖాస్తు ప్రామాణికతను ఎస్ఐఐ ఐడీ ( SII Id )ద్వారానే తనిఖీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.అందువల్ల అంతార్జాతీయ విద్యార్ధులు భారతీయ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఎస్ఐఐ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.

భారత్‌లోని ఏదైనా ఎస్ఐఐ అనుబంధ ఇన్‌స్టిట్యూట్ / విద్యాసంస్థ నుంచి అడ్మిషన్ ఆఫర్ లెటర్‌ను అందుకున్న తర్వాత విద్యార్ధులు వీసా దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Telugu Foreign, Indian Launches, Indianlaunches, International, Nri, Sii Website

కోర్సు వ్యవధిని బట్టి విద్యార్ధి వీసాలు ( Student visas )ఐదేళ్ల వరకు జారీ చేయబడతాయి.అవసరం అనుకుంటే గడువు కాలాన్ని పొడిగించవచ్చని నిపుణులు తెలిపారు.చెల్లుబాటయ్యే ఈ- స్టూడెంట్ వీసాలు కలిగి ఉన్న వారు ఏ ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు నుంచైనా భారత్‌లోకి ప్రవేశించవచ్చని అధికారులు తెలిపారు.

అయితే భారత్‌లో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకునే ప్రతి విద్యార్ధికి ఎస్ఐఐ ఐడీ ఉండాలని అధికారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube