ఈ ప్రపంచాన్ని కరోనా వైరస్ వచ్చి అతలాకుతలం చేసినప్పటి నుంచి దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలలో ఆరోగ్యం పై శ్రద్ధ కాస్త పెరిగింది అని చెప్పాలి.ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్ ను వదిలేసి ప్రోటీన్ ఫుడ్ వైపు పరుగులు తీస్తున్నారు.
అనారోగ్యం అని తెలిస్తే ఎంత ఇష్టమైనా సరే జంక్ ఫుడ్ ను అవాయిడ్ చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే షుగర్లు, బీపీలు చాలామందిలో వస్తున్నాయని వార్తలలో చదువుతూనే ఉన్నాం.
ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎండు చేపల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు.
చాలామంది ఇష్టంగా డ్రై ఫిష్ ని తింటూ ఉంటారు.రకరకాల కూరల్లో మిక్స్ చేసి ప్రతిరోజు తినేవారు కూడా ఉన్నారు.
సముద్ర తీరా ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రజలు ఎండు చేపలను ఎక్కువగా తింటూ ఉంటారు.ఎండు చేపల్లో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
కానీ ఓ వ్యాధి ఉన్న వారు మాత్రం ఎండు చేపలకు కాస్త దూరంగా ఉండటమే మంచిది.

అధిక రక్తపోటు అన్నది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని పట్టిపీడిస్తున్న వ్యాధి.ఎండు చేప ఎక్కువగా తినడం వల్ల మనిషి శరీరంలో రక్తపోటు పెరిగి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధనలలో తెలిసింది.అధిక రక్తపోటు ఉన్నవారు ఎండు చేపలను తినకపోవడమే మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు.
ఎండు చేపలు శరీరంలో ఉప్పు శాతాన్ని పెంచుతాయి.కాబట్టి శరీరంలో ఉప్పు ఎక్కువగా చేరినప్పుడు రక్తం రక్తనాళాలను అధిక ఒత్తిడికి గురిచేస్తుంది.
దీనివల్ల రక్తపోటు ఇంకా పెరిగే అవకాశం ఉంది.శరీరంలోని హార్మోన్లు ఇన్ఫ్లమేటరీ, ఇమ్యూనోలాజికల్ వ్యవస్థలను ఎఫెక్ట్ చేసే గుణాలు ఉప్పులో ఎక్కువగా ఉంటాయి.ఎండు చేప వల్ల శరీరంలో ఉప్పు శాతం పెరుగుతుంది.కాబట్టి ఈ రక్తపోటు ఉన్నవారు దాన్ని తినకపోవడమే మంచిది.
శరీరంలో ఉప్పు శాతం పెరిగితే మెదడు ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.