వీరసింహారెడ్డిలో జూనియర్ ఎన్టీఆర్.. నమ్మకపోయినా అసలు నిజం ఇదే!

సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య కాంబినేషన్ లో పదుల సంఖ్యలో సినిమాలు తెరకెక్కడంతో పాటు ఆ సినిమాలు కమర్షియల్ గా కూడా ఊహించని స్థాయిలో విజయాలను సొంతం చేసుకున్నాయి.

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రాజకీయ, కుటుంబ కారణాల వల్ల ఇప్పట్లో ఈ కాంబినేషన్ లో సినిమా రావడం అనేది సులువైన విషయం కాదు.

అయితే వీరసింహారెడ్డి మూవీలో బాలయ్య హీరోగా నటించగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించకపోయినా వినిపిస్తాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.ట్రైలర్ లో జై బాలయ్య అనే డైలాగ్ వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే ఆ అరిచిన వ్యక్తులలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారని సమాచారం అందుతోంది.ఈ విధంగా వీరసింహారెడ్డి సినిమాలో ఎన్టీఆర్ వినిపిస్తారని బోగట్టా.

జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరైన రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి ఈవెంట్ లో అరిచిన అరుపులకు సంబంధించిన వాయిస్ ను వీరసింహారెడ్డి సినిమాలో పెట్టారు.సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తుండగా ఒక పాత్ర పేరు వీరసింహారెడ్డి అయితే మరో పాత్ర పేరు బాల నరసింహారెడ్డి అని సమాచారం అందుతోంది.వీరసింహారెడ్డి సినిమా బుకింగ్స్ కొరకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే.

Advertisement

వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.శృతి హాసన్ పాత్రకు ఈ సినిమాలో ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.వీరసింహారెడ్డి మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావాల్సి ఉంది.

వీరసింహారెడ్డి కచ్చితంగా ఆడి తీరుతుందని బాలయ్య కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేశ్ కనగరాజ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు