టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఊహించని స్థాయిలో పెరుగుతుండగా ప్రభాస్( Prabhas ) అభిమానులను ఎంతో గౌరవిస్తారనే సంగతి తెలిసిందే.తాజాగా ప్రభాస్ అభిమానులతో కొన్ని ఫోటోలు దిగగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలలో ప్రభాస్ ఇల్లు కూడా ఉండగా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ప్రభాస్ సింపుల్ గా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం కల్కి అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో భైరవ అనే పాత్రలో కనిపించనున్నారు.కల్కి సినిమా( Kalki 2898 AD )లో యాక్షన్ సీన్స్ తో పాటు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని అదే సమయంలో కథ, కథనం కొత్తగా ఉంటాయని తెలుస్తోంది.నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఈ సినిమాలో మరో ప్రపంచాన్ని చూపించబోతున్నారని కల్కి ప్రేక్షకుల అంచనాలను ఎన్నో రెట్లు మించి ఉండబోతుందని భోగట్టా.
మరోవైపు ప్రభాస్ సింపుల్ గా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కల్కి 2898 ఏడీ విడుదలైన తర్వాత ప్రభాస్ కొత్త సినిమాలకు సంబంధించి వరుస అప్ డేట్స్ రానున్నాయని భోగట్టా.ప్రభాస్ రాజాసాబ్, స్పిరిట్ సినిమాల కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రభాస్ రెమ్యునరేషన్ ఇతర హీరోల కంటే ఎక్కువగా ఉంది.ప్రభాస్ సినిమా సినిమాకు జానర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.విభిన్నమైన జానర్ సినిమాలను ఎంచుకోవడం ద్వారా ప్రభాస్ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ప్రభాస్ సినిమాలకు పోటీగా ఇతర సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు భయపడుతున్నారు.ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా రాజమౌళి ప్రభాస్ కాంబో రిపీట్ కావాలని కోరుకుంటున్నా అభిమానుల సంఖ్య మరింత పెరుగుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.