సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu)పరిచయం అవసరం లేని పేరు.టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు హృదయ కాలేయం, కొబ్బరిమట్ట, క్యాలి ఫ్లవర్ వంటి ఎన్నో వినోదాత్మక చిత్రాలలో నటించే ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు.
ఇక సంపూర్ణేష్ బాబు సినిమాల లైనప్ చూసి ఈయన ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంటారని అందరూ భావించారు కానీ ఉన్నఫలంగా ఈయన సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు అవకాశాలు లేకపోవడం వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

చాలా రోజుల తర్వాత సంపూర్ణేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన కెరియర్ ఇలా కావడానికి పలు కారణాలను తెలిపారు.అయితే బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమం వల్ల తన కెరియర్ పట్ల పూర్తిగా దెబ్బ పడిందని సంపూర్ణేష్ బాబు తెలిపారు.
ఈయన బిగ్ బాస్ సీజన్ వన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ (Ntr)హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ తనను ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు.

సంపూర్ణేష్ బాబు హౌస్ లోకి వెళ్లిన తొమ్మిది రోజులకే హౌస్ నుంచి బయటకు వచ్చారు.అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ హౌస్ నుంచి బయటకు వెళ్ళొద్దని హౌస్ లో కొనసాగితే తనకు చాలా మంచి కెరియర్ ఉంటుందని ఎన్టీఆర్ ఎంతగా చెప్పినా తను మాత్రం వినకుండా హౌస్ నుంచి బయటకు వచ్చానని అందుకే తన కెరీర్ ఇలా మారిపోయిందని తెలిపారు.ఆరోజు ఎన్టీఆర్ గారి మాట విని ఉంటే కచ్చితంగా నేను ఈ సీజన్ విన్నర్ అయ్యి ఉండేవాడిని సంపూర్ణేష్ బాబు గుర్తు చేసుకున్నారు.
మరి ఇప్పుడు బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్తారా అనే ప్రశ్న కూడా ఈయనకు ఎదురయింది.ప్రస్తుతం పల్లె వాతావరణము పూర్తిగా అలవాటు పడిన తాను బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగలేనని వెల్లడించారు.