టాలీవుడ్( Tollywood ) ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh )గతేడాది అక్టోబర్ లో జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న సమయంలో గాయపడిన సంగతి తెలిసిందే.తాజాగా ఒక ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న రకుల్ తన ఆరోగ్యం గురించి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
జిమ్ లో గాయం నాకో ఎదురుదెబ్బ అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు.ఇప్పటికీ నేను సరైన స్థితిలోకి రాలేదని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు.
అప్పటికంటే నేను కొంచెం మెరుగైనప్పటికీ పుర్తిగా కోలుకోలేదని ఆమె పేర్కొన్నారు.నేను చాలా విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.అన్నీ మనం అనుకున్న విధంగానే జరుగుతాయని అనుకున్నా ఒక్కోసారి కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిదని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.ఈ గాయం రకుల్ కెరీర్ పై కూడా కొంతమేర ప్రభావం చూపింది.

గాయాన్ని నేను మొదట నిర్లక్ష్యం చేశానని చికిత్స తీసుకోవాలనే సమయానికి దాని తీవ్రత ఎక్కువైందని గాయం నుంచి కోలుకోవాలంటే చాలా రోజులు పడుతుందని వారం రోజులకు అర్థమైందని ఆమె అన్నారు.ధైర్యంగా దాని నుంచి కోలుకుంటానని రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.నా వర్క్ లో నేను బిజీ అవుతున్నానని రకుల్ ప్రీత్ పేర్కొన్నారు.

వ్యాయామం చేసే సమయంలో 80 కేజీల బరువు ఎత్తే క్రమంలో రకుల్ కు గాయం కావడం గమనార్హం.శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోవడం ఎంతో అవసరం అని ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్, దే దే ప్యార్ దే2 సినిమాలతో బిజీగా ఉన్నారు.
రకుల్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి.హీరోయిన్ రకుల్ రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.







