టాలీవుడ్ ఇండస్ట్రీకి ( Tollywood industry )ముఖ్యమైన నెలలలో మార్చి నెల కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే.మార్చి నెలలో ఏకంగా 29 సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాలలో కేవలం రెండంటే రెండు సినిమాలు హిట్ గా నిలవడం గమనార్హం.
మార్చి నెల మొదటి వారంలో ఛావా సినిమాతో ( movie Chava )పాటు కింగ్ స్టన్, రాక్షస, శివంగి సినిమాలు విడుదలయ్యాయి.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా రీరిలీజ్ అయింది.
ఛావా మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీలో( Bollywood industry ) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా తెలుగు వెర్షన్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదు.మార్చి నెల రెండో వారంలో దిల్ రూబా, కోర్ట్ సినిమాలు రిలీజ్ కాగా దిల్ రూబా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే కోర్ట్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
నాని నిర్మాతగా కోర్ట్ సినిమాతో సత్తా చాటారని చెప్పవచ్చు.

మార్చి నెల మూడో వారంలో సప్తగిరి పెళ్లికాని ప్రసాద్ విడుదలై ఫ్లాప్ కాగా సలార్, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు విడుదలై ఫ్లాప్ గా నిలిచాయి.మార్చి నెల నాలుగో వారంలో ఎల్2 ఎంపురాన్, వీర ధీర శూర, మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్( L2 Empuran, Veera Dheera Shoora, Mad Square, Robin Hood ) సినిమాలు రిలీజయ్యాయి.ఈ సినిమాలలో మ్యాడ్ స్క్వేర్ మాత్రమే హిట్ గా నిలిచింది.
మిగత సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.

ప్రతి సంవత్సరం మార్చి నెలలో విడుదలైన సినిమాలలో ఒకటి లేదా రెండు సినిమాలు హిట్ గా నిలుస్తుండటం గమనార్హం.మార్చి నెలలో విడుదలైన కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలను అందించాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.మార్చి నెలలో మరీ భారీ సినిమాలు అయితే విడుదల కాలేదు.







