టాలీవుడ్ ప్రముఖ యాంకర్లలో ఒకరైన ప్రదీప్ మాచిరాజుకు(Pradeep Machiraju) ప్రేక్షకుల్లో క్రేజ్ బాగానే ఉందనే సంగతి తెలిసిందే.ఈ యాంకర్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎదిగి సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు.30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju) ఆ సినిమాతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం జరిగింది.
ప్రదీప్ మాచిరాజు రెండో సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కాగా ఏప్రిల్ నెల 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్(Release in theaters) కానుంది.
ఈ సినిమా గురించి ప్రదీప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సినిమా కోసం నేను రెమ్యునరేషన్ లేకుండానే పని చేశానని ఆయన అన్నారు.నా నలుగురు ఫ్రెండ్స్ ఈ సినిమాకు నిర్మాతలుగా మారారని ప్రదీప్ మాచిరాజు కామెంట్లు చేయడం గమనార్హం.ఈ సినిమా కోసం నేను కూడా కొంత డబ్బు పెట్టానని అందుకే ఈ సినిమాకు పారితోషికం తీసుకోలేదని ప్రదీప్ మాచిరాజు చెప్పుకొచ్చారు.
సినిమా రిలీజై లాభాలు వస్తే ఎంతో కొంత తీసుకుంటానని ఆయన తెలిపారు.గత రెండు సంవత్సరాలుగా షోలు కూడా రెగ్యులర్ గా చేయట్లేదని ప్రదీప్ మాచిరాజు వెల్లడించారు.
కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని ఆయన కామెంట్లు చేశారు.

అయితే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ను నేను మేనేజ్ చేశానని ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju) వెల్లడించారు.ఈ సినిమా తర్వాత ప్రదీప్ మాచిరాజు కెరీర్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.ప్రదీప్ మాచిరాజు హీరోగా సక్సెస్ సాధించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రదీప్ మాచిరాజు భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.ప్రదీప్ మాచిరాజు బయటి బ్యానర్లలో సినిమాలలో నటిస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.