టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన పాయల్ రాజ్ పుత్ ( Payal Rajput )తక్కువ సినిమల్లోనే నటించినా తన నటనతో మంచి పేరు సంపాదించుకున్నారు.అజయ్ భూపతి డైరెక్షన్ లో పాయల్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలు( RX 100, Tuesday Movies ) పాయల్ రాజ్ పుత్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ ఒక నటిగా రాణించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం అని ఆమె తెలిపారు.
ప్రతిరోజూ కూడా ఒక అనిశ్చిత భారంతో మొదలవుతుందని పాయల్ చెప్పుకొచ్చారు.ఎందుకంటే నేను ప్రతిరోజూ ప్రతిభను కప్పివేసే నెపోటిజం, పక్షపాతం నిండి ఉన్న ప్రపంచంలోకి అడుగుపెడుతున్నానని పాయల్ రాజ్ పుత్ వెల్లడించారు.
నాకొక సందేహం ఉందని ఆమె కామెంట్లు చేశారు.

నేను అంకిత భావంతో ఎంతో కష్టపడుతున్నప్పటికీ వెలుగులు కనిపించడం లేదని ఆధిపత్యం చలాయించే ఈ ప్రపంచంలో నిజంగానే రాణించగలనని సందేహం వస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయని పాయల్ వెల్లడించారు.కొంతమంది తమ ఇంటిపేరుతో ఆఫర్లు సొంతం చేసుకుంటుంటే మరి కొందరు ఏజెంట్ల సహాయంతో ఆఫర్లను అందుకుంటున్నారని పాయల్ పేర్కొన్నారు.

ఇలాంటివి నేను చాలా గమనించానని ఇలాంటి ప్రదేశంలో నేను రాణించగలనా అనే సందేహం వస్తుందని పాయల్ పేర్కొన్నారు.పాయల్ రాజ్ పుత్ రెమ్యునరేషన్ ( Remuneration )ప్రస్తుతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.రాబోయే రోజుల్లో పాయల్ రాజ్ పుత్ ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.ఈ మధ్య కాలంలో పాయల్ రాజ్ పుత్ కొత్త సినిమాలలో నటించలేదు.మంగళవారం సినిమా సక్సెస్ సాధించినా పాయల్ రాజ్ పుత్ కు ఆ సినిమా కెరీర్ పరంగా ప్లస్ కాలేదు.బోల్డ్ సినిమాలలో నటించడం పాయల్ రాజ్ పుత్ కు ఒక విధంగా మైనస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
స్టార్ హీరోయిన్ పాయల్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.పాయల్ కు ఈ ఏడాదైనా కలిసిరావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.