సన్నగా అవ్వడం వల్ల అందాన్ని కోల్పోయిన టాలీవుడ్ హీరోయిన్స్

సాధారణంగా హీరోయిన్లు స్లిమ్ గా అందంగా ఉండాలి.ఉంటారు కూడా.

 Tollywood Heroines Who Vanished Their Beauty, Samantha, Rashikanna, Avikagore, A-TeluguStop.com

అయితే అందరు హీరోయిన్లలు అలా ఉండాలనే రూలేమీ లేదు.బొద్దుగా ఉంటేనే చూడ్డానికి బాగుంటారు.

అయితే వాళ్లకు కూడా ఎప్పుడో ఒకప్పుడు స్లిమ్ గా కావాలనే ఆలోచన వస్తుంది.అప్పుడే జిమ్ లో కుస్తీలు పట్టి అనుకున్నది సాధిస్తారు.

నయనతార లాంటి వాళ్లు మొదట్లో కొంచెం లావుగా ఉండేది.ఆ తర్వాత బరువు తగ్గి మంచి ఫిజిక్ సాధించింది.

చాలా అవకాశాలు దక్కించుకుంది.కానీ కొందరు హీరోయిన్లు సన్నగా ఉండటం కంటే బొద్దుగానే బాగున్నారు అనేలా తయారయ్యారు.ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

శాలిని పాండే

అర్జున్ రెడ్డితో మంచి పేరు సంపాదించిది ఈ ముద్దుగుమ్మ.చక్కటి ఫిజిక్ తో ఉన్న ఈ అమ్మడు తాజాగా బాగా సన్నబడింది.కానీ.ఇప్పటితో పోల్చితే గతంలోనే అందంగా కనిపించింది.

రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువగా జిమ్ లోనే గడుపుతుంది.తొలుత బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ భామ మరీ సన్నబడి అందాన్ని కోల్పోయింది.

కీర్తి సురేష్

నేను శైలజ, మహానటి సినిమాలతో ఫ్యాన్స్ కు మరింత దగ్గర అయ్యింది కీర్తి సురేష్.తన ముద్దు రూపంతో అందరినీ ఆకట్టుకుంది.కానీ ఇప్పుడు బరువు తగ్గి మరీ అంత అందంగా కనిపించడం లేదు.

శ్రుతి హాసన్

గతంలో కాస్త చుబ్బిగా ఉండి అందంగా కనిపించేది శ్రుతి హాసన్.ప్రస్తుతం చాలా సన్నబడింది.

క్రాక్ మూవీలో మరీ సన్నగా కనిపించింది.ఇప్పటితో పోల్చితే గతంలోనే ఆమె అందంగా కనిపించింది.

Telugu Avikagore, Keerthi Suresh, Rashikanna, Samantha, Shalini Pandey, Sruthi H

సమంత

రకుల్ తర్వాత ఫిట్ నెస్ తో కనిపించే మరో నటి సమంతా.పలు సినిమాల్లో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఓ బేబి సినిమా తర్వాత మరింత సన్నబడింది.

అనుపమ పరమేశ్వర్

రింగుల జుట్టు చక్కటి రూపంతో అఆ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వర్.కానీ ఈ మధ్య మరీ బక్కగా అయ్యింది.

రాశీకన్నా

సుప్రీం సినిమాలో బొద్దుగా కనిపించిన రాశీకి యూత్ అట్రాక్ట్ అయ్యారు.ప్రస్తుతం ఆమె కూడా సన్నాగా అయ్యి అందాన్ని కోల్పోయింది.

అవికాగోర్

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో ఫేమస్ అయిన ఈ అమ్మాయి పలు సినిమాల్లో బొద్దుగా ముద్దుగా కనిపించింది.కానీ ప్రస్తుతం మరీ సన్నబడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube