ప్రస్తుతం చలి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో చలిని తట్టుకుని ఉండేందుకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రాత్రింబగళ్లు స్వెటర్స్ ధరిస్తారు.
అలాగే స్వెటర్ వేసుకొనే నిద్రించడం చాలా మందికి ఉండే అలవాటు.అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం స్వెటర్ వేసుకొని నిద్రించడం అంత మంచిది కాదని అంటున్నారు.
మరి పడుకునేటప్పుడు స్వెటర్ ఎందుకు వేసుకోకూడదు.? అసలు వేసుకుంటే ఏం అవుతుంది.? వంటి విషయాలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
స్వెటర్ వేసుకుని నిద్రించడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు బయటకు వెళ్లలేకపోతాయి.
దాంతో రక్త పోటు స్థాయిలు పెరగడం లేదా తగ్గడం వంటివి జరుగుతాయి.ఫలితంగా కళ్లు తిరగడం, మైకం, తల నొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి.
అలాగే స్వెటర్ వేసుకుని నిద్రించడం వల్ల చర్మానికి సరిగ్గా గాలి తగలదు.తేమ కూడా తగ్గి పోతుంది.
దాంతో చర్మం పొడి బారి పోయి ఎండిపోయినట్టు అయిపోతుంది.
స్వెటర్ వేసుకుని పడుకోవడం కారణంగా శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది.
ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం వల్ల ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండటం, ఛాతి నొప్పి పుట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి వాటిని ఫేస్ చేయాల్సి ఉంటుంది.ఇక గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్న వారు, షుగర్ వ్యాధి గ్రస్తులు స్వెటర్ వేసుకుని నిద్రించకపోవడమే మంచిదని అంటున్నారు.
లేకుంటే ఆయా సమస్యలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది.
ఒక వేళ చలి ఎక్కువగా ఉంది.ఖచ్చితంగా స్వెటర్ వేసుకోవాలి అనుకుంటే.కాస్త పల్చగా ఉండే స్వెటర్ ను ఎంచుకుని వేసుకోవడం మంచిది.
లేదు అనుకుంటే గనుక మీరు ఉండే గదిలో రూమ్ హీటర్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.తద్వారా చలి పెట్టకుండా ఉంటుంది.
ఫలితంగా స్వెటర్ వేసుకునే పనే ఉండదు.