సాధారణంగా ఏ సినిమా అయినా అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించదు.దర్శకుడు రాజమౌళి సైతం ఇందుకు మినహాయింపు కాదు.
పైకి చెప్పకపోయినా రాజమౌళి సక్సెస్ లను చూసి కుళ్లుకునే వాళ్ల సంఖ్య ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది.రెండు దశబ్దాల కాలంలో రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు 12 మాత్రమే అయినా ఆ సినిమాలు అన్నీ సక్సెస్ సాధించడం గమనార్హం.
ఆర్ఆర్ఆర్ కు క్రిటిక్స్ నుంచి ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
తెలుగులో దాదాపుగా అన్ని వెబ్ సైట్లు ఈ సినిమాకు మంచి రేటింగ్ ఇచ్చాయి.
అయితే కొంతమంది కావాలని ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు.బాలీవుడ్ క్రిటిక్స్ లో కొందరు కూడా ఈ సినిమా గురించి నెగిటివ్ గా చెబుతున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ గురించి నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లపై ప్రముఖ నిర్మాత పీవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక్కరోజు కూడా షూటింగ్ లో నిలబడని లైఫ్ లో ఒక్క షాట్ కూడా తియ్యని వాళ్లు సినిమాలు తీయడం గురించి అందరికీ క్లాసులు పీకుతుంటారని పీవీపీ తెలిపారు.

కానీ సినిమాలు తీయడం గురించి అందరికీ క్లాసులు పీకుతారని పీవీపీ చెప్పుకొచ్చారు.సినిమా ఇండస్ట్రీలో భయపడుతూ బ్రతికేవాళ్లు తమ కష్టాన్ని ఎవరైనా అపహాస్యం చేస్తే తిరగబడాలని పీవీపీ కామెంట్లు చేయడం గమనార్హం.

కళకు కులం పిచ్చి అంటించే వాళ్ల కుత్తుక కోయాలని పీవీపీ కామెంట్లు చేశారు.దేశభక్తితో తెరకెక్కిన సినిమాలను, జాతి గర్వించే సినిమాలను చూస్తే శభాష్ అనాలని తెలుగువాడు జాతీయ సంపద అయినందుకు సంతోషించాలని ఆయన సూచించారు.ఆర్ఆర్ఆర్ సినిమాను చూసి తెలుగువాడిగా గర్వపడాలని పీవీపీ వెల్లడించారు.ఈ సినిమా దర్శకనిర్మాతలతో తనకెలాంటి వ్యాపారలావాదేవీలు లేవని పీవీపీ చెప్పుకొచ్చారు.







