మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..అయితే విటమిన్ డి లోపం ఉన్నట్టే?

విట‌మిన్ డి. శ‌రీరానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో ఇది ఒక‌టి.

 How To Find Vitamin D Deficiency Without Test! Vitamin D Deficiency, Vitamin D,-TeluguStop.com

కండ‌రాలు బ‌లంగా ఉండాల‌న్నా, ఎముకలకు అవసరమైన క్యాల్షియంను శ‌రీరం గ్ర‌హించాల‌న్నా, ఇన్ఫెక్షన్ల బారిన ప‌డ‌కుండా ఉండాల‌న్నా, మెద‌డు స‌రిగ్గా ప‌ని చేయాల‌న్నా, రోగ నిరోధక వ్యవస్థ స్ట్రోంగ్‌గా ఉండాల‌న్నా విట‌మిన్ డి ఎంతో అవ‌స‌రం.అయితే ఈ మ‌ధ్య కాలంలో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది విట‌మిన్ డి లోపంతో బాధ ప‌డుతుంటారు.

ఈ లోపాన్ని ముందే గ్ర‌హించి.త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఎటువంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

కానీ, అల‌స్యం అయ్యే కొద్ది.అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టేస్తుంటాయి.మ‌రి ఇంత‌కీ విట‌మిన్ డి లోపాన్ని ఎలా గుర్తించాలి.? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది.సాధార‌ణంగా విట‌మిన్ డి లోపం ఏర్ప‌డిన‌ప్పుడు కొన్ని ల‌క్ష‌ణాలు కామ‌న్‌గా క‌నిపిస్తాయి.అవేంటో తెలుసుకుంటే విట‌మిన్ డి లోపాన్ని ఈజీగా గుర్తించ‌వ‌చ్చు.మ‌రి ఆ ల‌క్ష‌ణాలు ఏంటీ లేట్ చేయ‌కుండా చూసేయండి.

విట‌మిన్ డి లోపం ఏర్ప‌డిన‌ప్పుడు నీర‌సం, తీవ్రమైన అల‌స‌ట‌, శ‌రీరం మొత్తం బ‌ల‌హీనంగా మార‌డం, ఏ ప‌ని చేయ‌లేకపోవ‌డం, ఆలోచనా శక్తి తగ్గిపోవడం, త‌ల‌నొప్పి వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

Telugu Effectsvitamin, Tips, Pressure, Stress, Symptoms, Vitamin-Telugu Health -

అలాగే చ‌ర్మంపై త‌ర‌చూ ప‌గుళ్లు రావ‌డం, ఎముక లేదా కండరాల నొప్పి, త‌ర‌చూ అనారోగ్యానికి గురికావ‌డం, తెలియ‌ని ఆందోళ‌న‌, అధిక ఒత్తిడి, ఉన్న‌ట్టు ఉండి బ‌రువు పెర‌గ‌డం, న‌డుము నొప్పి, హెయిర్ ఫాలో అధికంగా ఉండ‌టం వంటి ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి.

ఈ ల‌క్ష‌ణాలు మీలో గ‌నుక ఉంటే ఏ మాత్రం అధైర్య ప‌డ‌కుండా.విట‌మిన్ డి లోపాన్ని పూడ్చుకునే ప్ర‌య‌త్నం చేయాలి.సూర్యుడి నుంచి సహజంగా అందే విటమిన్ డి.కొన్ని కొన్ని ఆహారాల ద్వారా కూడా పొందొచ్చు.కోడిగుడ్డు, చేపలు, రొయ్యలు, ఛీజ్‌, పన్నీర్‌, నెయ్యి, పాలు, పెరుగు, పుట్టగొడుగులు, బాదం, కమలాపళ్లు, గోధుమలు, రాగులు, ఓట్స్‌, వంటి వాటిలో విట‌మిన్ డి ఉంటుంది.

కాబ‌ట్టి, వీటిని డైట్‌లో చేర్చుకుంటే విటమిన్ డి లోపానికి బై బై చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube