బంగారు గుడ్లు పెట్టే కోడి ఏమో కాని... ఈ కోడిని చూడండి, అవాక్కయి నోరెళ్లబెడతారు

ఎవరైనా బాగా సంపాదించి పెడితే, లేదంటే ఎవరిద్వారా నైనా, ఏ వస్తువు ద్వారానైనా డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా వస్తే అప్పుడు ఆ వ్యక్తిని బంగారు బాతు అని, బంగారు గుడ్డు పెట్టే బాతు అంటూ ఉంటారు.కోడి బంగారు గుడ్లను పెట్టడం అది నూటికి వెయ్యి శాతం నిజం కాదు.

 This Hen Gets Guinness Book Of World Record-TeluguStop.com

ఏ కోడి అయినా, ఎలాంటి బ్రీడ్‌ అయినా కూడా రోజుకు ఒక్క గుడ్డును మాత్రమే పెడుతుంది.ఏదో ఒక రోజు, చాలా అరుదుగా రోజుకు రెండు గుడ్లు కోడి పెడుతుంది.

కాని ఈ కోడి మాత్రం రోజుకు రెండు మూడు గుడ్ల చొప్పున పెట్టేసి తన యజమానినే కాకుండా స్థానికులందరిని, సోషల్‌ మీడియా జనాలను ఆశ్చర్య పర్చింది.

 This Hen Gets Guinness Book Of World Record-బంగారు గుడ్లు పెట్టే కోడి ఏమో కాని… ఈ కోడిని చూడండి, అవాక్కయి నోరెళ్లబెడతారు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కర్ణాటక రాష్ట్రం చిత్ర దుర్గ జిల్లా హిరియురు తాలుక హుచ్చమ్మనహళ్ళి గ్రామంలోని ఒక కోడి పది రోజుల్లో ఏకంగా 35 గుడ్లను పెట్టేసింది.రోజుకు రెండు మూడు గుడ్లను పెట్టింది.రెండు మూడు రోజులైతే ఏకంగా నాలుగు గుడ్లను కూడా పెట్టిందట.

మొత్తం 35 గుడ్లను కేవలం పది రోజుల్లోనే ఈ కోడి పెట్టడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యింది.కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా నిలిచింది.లిమ్కా బుక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ రికార్డుల్లో ఈ కోడిని ఎక్కించేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒక కోడి రోజుకు ఒక గుడ్డు పెట్టడం మామూలే కాని, ఈ కోడి మాత్రం ఏకంగా మూడు నాలుగు గుడ్లను పెట్టడంతో దాని యజమానులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.మా కోడం బంగారు కోడి, పది రోజుల్లోనే 35 గుడ్లు పెట్టిందంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.8 నెలల వయసున్న ఆ కోడి తన 35 గుడ్లను ప్రస్తుతం పొదుగుతోంది.ఆ 35 గుడ్లలో కనీసం 30 పిల్లలయినా పుడుతాయని ఆ యజమాని సంతోషంగా చెబుతున్నాడు.బంగారు కోడి అంటే ఇదే కదా.!

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు