టాలీవుడ్ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ ( Anantha sriram )గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ జెనరేషన్లో వున్న పాటల రచయితలలో చెప్పుకోదగ్గ రచయిత ఎవరన్నా వున్నారు అంటే అది అనంత శ్రీరామ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఈమధ్య కాలంలో ఏమైంది తెలియదు కానీ తెలుగు సినిమాలలో తెలంగాణ యాస, భాష( Telangana accent, language ) ఎక్కువగా తొణికిసలాడుతోంది.ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు, అది వేరే విషయం.
ఐతే ఈ క్రమంలో తెలంగాణతనాన్ని చూపించాలనే నెపంతో కొందరు పొరపాట్లు చేస్తున్నారని కొందరు కుహనా మేధావులు ఫీల్ అవుతున్నారు.
బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా( Bhagwant Kesari movie ) రేపోమాపో రిలీజ్ కాబోతోంది కదా.ఈ సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన ఓ పాట విషయమై ఇపుడు సోషల్ మీడియాలో ఓ రచ్చ జరుగుతోంది.ఆ సినిమాలో వచ్చిన ఓ పాట విషయమై ఇపుడు పెద్ద డిబేట్ జరుగుతోంది.
ఈ పాటలో తెలంగాణ పదాల్ని పేర్చిన అనంత శ్రీరామ్ కొన్నిటిని ఏదో రాయాలని రాసాడే తప్ప, అతనికి నిజమైన తెలంగాణ పదాలు తెలియవని అంటున్నారు.తెలియకపోతే పూర్తిగా తెలుసుకుని రాయాలి, లేదంటే తన వల్ల కాదని వదిలేయాలి కానీ తెలంగాణ భాషను ఖూనీ చేయడం దేనికి? అంటూ ఇపుడు ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో కొందరు అయితే తెలంగాణ పాటలు పర్‌ఫెక్ట్ తెలంగాణ పదాలతోనే రాసేవాళ్లు బోలెడు మంది తెలంగాణలోనే వుంటుండగా ఈ ఇతర ప్రాంతాలవారితో రాయడం ఎందుకన్నట్టు వాదిస్తున్నారు.తెలంగాణ పదం సమయానికి దొరకలేదని రొటీన్ పదాల్లో ఏదో ఒకటి పాటల్లో బలవంతంగా చొప్పిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.సదరు సినిమా పాటలో ఒప్పుల కుప్పా, వయ్యారి భామ వంటి పదాలు ఎందుకు చేర్చారో ఆ అనంత శ్రీరామ్ కలానికే తెలియాలి అని ప్రశ్నిస్తున్నారు.కాగా దీనిపై భాషా పండితులు ఏమంటున్నారంటే… రెండు తెలుగు రాష్ట్రాలు వేరు పడినంత మాత్రాన ఇపుడు ఇలా యాస, భాష అంటూ లేనిపోని కుటిల రాజకీయాలు చేయొద్దని మనవి చేసుకుంటున్నారు.
నిజంగా సినిమా సాహిత్యం పట్ల అంతలా బాధపడేవారైతే ఒకసారి కలం పట్టుకుంటే తెలుస్తుందని సూచిస్తున్నారు.అవును, వాస్తవంగా వివిధ ప్రాంతాలను బట్టి బాషలో యాస అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది.
అంతమాత్రాన ఈ పదం ఆ ప్రాంతానికి చెందింది… ఆ పదం వేరే ప్రాంతానికి చెందిందని చెప్పడం అసాధ్యమని అంటున్నారు కొందరు భాషావేత్తలు.