Kota Srinivas Rao Gopala Rao: అలా రావుగోపాలరావు విలన్ పాత్రని కొట్టేసిన కోటా శ్రీనివాసరావు? 

ఈ ప్రపంచంలోని ఏ భాష సినిమా చూసినా మనల్ని కొన్ని అరుదైన పాత్రలు మాత్రమే వెంటాడుతుంటూ వుంటాయి.వాటిని సినిమా పండితులు ఐకానిక్ క్యారెక్టర్స్( Iconic Characters ) అని అంటారు.

 Kota Srinivas Rao Taken Rao Gopal Rao Role Aha Naa Pellanta Movie-TeluguStop.com

అవి ఏ నటుడు పోషించాలో నిర్ణయించేది నిర్మాత కాదు, దర్శకుడు కాదు, రచయిత కాదు, ఆఖరికి ఆ పాత్ర పోషించే నటుడు కూడా కాదు.అవును, కాలమే ఆయా క్యారెక్టర్స్ ఎవరు చేయాలో నిర్ణయిస్తుంది.

దాన్నే మనవాళ్లు అదృష్టం, దేవుడు అని కూడా అంటూ వుంటారు.ఒకానొక సమయంలో జంధ్యాల గారు( Jandhyala ) లక్ష్మీపతి పాత్ర తీరుతెన్నులు రాసుకున్నారు గానీ అది ఎవరు చేస్తే బాగుంటుంది? అనే ఆలోచన చేయలేదు.ఈ క్రమంలో అనుకోకుండా ఒకరోజు “మండలాధీశుడు” సినిమా చూసి ఆ పాత్రకి కోటనే న్యాయం చేస్తాడు అని, నిర్మాత రామానాయుడు గారిని కలిసాడట.

Telugu Jandhyala, Ramanaidu, Rajendra Prasad, Rao Gopal Rao, Tollywood-Movie

అయితే, ఆ సమయంలో రావుగోపాలరావు( Rao Gopala Rao ) హవా బాగా నడుస్తుంది, కానీ ఊహించని విధంగా ఆ క్యారెక్టర్ కోట( Kota Srinivasa Rao ) గారికి దక్కింది.ఒకవేళ జంధ్యాల గారు “మండలాధీశుడు” సినిమా( Mandaladeesudu ) చూడకపోయి ఉంటే ఖచ్చితంగా లక్ష్మీపతిగా రావుగోపాలరావునే నటించేవారు.దాదాపు 20 రోజులపాటు నిర్మాత రామానాయుడు, దర్శకుడు జంధ్యాల గార్ల మధ్య ఈ వాదన నడిచింది, ఆయనేమో రావుగోపాలరావు అని, ఈయనేమో కోటశ్రీనివాసరావు అని.చివరికి జంధ్యాల గారు ‘సార్ టెస్ట్ షూట్ చేద్దాం.మీకు ఏమాత్రం అసంతృప్తిగా అనిపించినా మీరు చెప్పినట్టే నడుచుకుంటాను’ అని అన్నడట.

Telugu Jandhyala, Ramanaidu, Rajendra Prasad, Rao Gopal Rao, Tollywood-Movie

దాంతో కోట గారిని పిలిపించి లక్ష్మీపతిగా( Lakshmipathy ) మార్చారు, కోట కూడా తల గోక్కుంటూ’ అలాగా, మొదట ఈ పాత్రను రావుగోపాలరావుతో అనుకున్నారా, అలాగా? ఇప్పుడు నేనేం చేయాలి? ఆయా పెద్ద నటుడు.నాకంటే అతనయితేనే అవుంటుందేమో?’ అంటూ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి రెచ్చిపోయాదట.ఇంకేముంది కట్ చేస్తే ‘అహ నాకేంటి?’ అనే కోటా మేనరిజం జనాలకి విపరీతంగా నచ్చిందట.ఇక ఆ షూటింగ్ సమయంలోనే రామానాయుడు( Ramanaidu ) కోట శ్రీనివాసరావు గారికి మొత్తం రెమ్యూనరేషన్ ఇచ్చేవేశాడట.

అది అసలు విషయం.ఇక ఆ సినిమాలో కోట యాక్టింగ్ చూసి , సగటు సినిమా ప్రక్షకుడు కూడా ఎగిరి గంతులు వేశారట.

ఇక లక్ష్మీపతి అనే పాత్ర కోటగారి సినీ జీవితానికి కోహినూర్ లాంటిది అనడంలో అతిశయోక్తి లేదు… ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube