వైల్డ్ లైఫ్ (Wildlife)వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతుంటాయి.ముద్దు ముద్దుగా ఉండే చిన్న జంతువుల వీడియోలు అందర్నీ ఆకట్టుకుంటాయి, ఇక డేంజరస్ (Dangerous)జంతువుల వీడియోలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.దీన్ని చూసి నెటిజన్లు షాక్ అయిపోతున్నారు, భయంతో వణికిపోతున్నారు.
“నేచర్ ఈజ్ అమేజింగ్” అనే ఎక్స్ అకౌంట్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు.ఈ వీడియోలో ఒక మహిళ డోర్ తాళం తీస్తోంది.
అంతే, డోర్ తెరిచిందో లేదో, ఎదురుగా ఒక పెద్ద పులి (Big tiger)కనిపించింది.దాని కళ్లు మాత్రం ఆ అమ్మాయిపైనే ఉన్నాయి.
కొన్ని సెకన్ల పాటు ఇద్దరూ సైలెంటుగా ఒకరిని ఒకరు చూసుకున్నారు.అమ్మాయికి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయాయి.
వెంటనే డోర్ వేసేసింది.పులితో ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ (Face to face fighting with a tiger)తప్పించుకుంది.
పోస్ట్ చేసిన వాళ్లు క్యాప్షన్ కూడా అదిరిపోయేలా పెట్టారు.“ఒక్కసారి మీరు డోర్ తెరవగానే ఇలా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి… మీరు ఏం చేస్తారు?” అని అడిగారు.ఈ వీడియోకి 2.9 కోట్ల వ్యూస్ వచ్చాయంటే మామూలు విషయం కాదు.వీడియో చూసిన ఎక్స్ యూజర్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.కొందరు అవాక్కవుతుంటే, మరికొందరు భయంతో చచ్చిపోతున్నారు.
“చూస్తుంటే పెంపుడు పులిలా ఉంది” అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.“చాలా సైలెంట్‌గా ఉంది కదా.ఎగ్జోటిక్ పెట్‌లా ఉందేమో?” అని ఇంకొకరు డౌట్ పడ్డారు.కానీ ఇంకొందరు మాత్రం ఒప్పుకోలేదు.“అది చూస్తేనే తెలుస్తోంది కదా అడవి పులి అని, ఎంత రాజసంగా ఉందో చూడండి.” అని వాదించారు.చాలా మంది అమ్మాయి సేఫ్టీ గురించి టెన్షన్ పడ్డారు.“నేనైతే అక్కడే గడ్డకట్టుకుపోయేదాన్ని.ఏం చేసేదాన్నో నాకే తెలీదు.” అని ఒకరు భయపడ్డారు.ఇంకొకరు జోక్ పేల్చారు, “డోర్ పులిని ఆపుతుందా ఏంటి, అమ్మాయి మాత్రం సూపర్ ఫాస్ట్‌గా డోర్ వేసింది.” అని అన్నారు.
కొందరైతే పులి అందానికి ఫిదా అయిపోయారు.“వావ్, ఎంత అందమైన జంతువు.చూడటానికి మాత్రం భయంకరంగా ఉంది.” అని ఒకరు కామెంట్ చేశారు.“దాని అందం కట్టిపడేస్తోంది కానీ భయంతో వణుకు పుట్టిస్తోంది.” అని ఇంకొకరు రాసుకొచ్చారు.వీడియో మాత్రం ఇంకా వైరల్ అవుతూనే ఉంది.అందరి మదిలో ఒకటే ప్రశ్న ఆ అమ్మాయి ప్లేస్‌లో మీరుంటే ఏం చేసేవారు? అని.మరి మీరేం చేస్తారో కామెంట్స్‌లో తెలపండి.