అక్కినేని నాగచైతన్య( Nagachaitanya ) సాయి పల్లవి( sai Pallavi ) జంటగా నటించిన తాజా చిత్రం తండేల్. డైరెక్టర్ చందు మొండేటి ( Chandu Mondeti )దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తండేల్ జాతర పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy)వంగా హాజరయ్యారు.

కేవలం చిత్ర బృందం మీడియా సమక్షంలో మాత్రమే ఈ వేడుక జరిగింది.ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
కొంతమంది వ్యక్తులతో ఎలాంటి పరిచయం లేకపోయిన వారిని చూడగానే చాలా ఇష్టం కలుగుతుంది.అలాంటి వారిలో చైతన్య కూడా ఒకరిని తెలిపారు.ఆయన నటిస్తున్న కేడి సినిమా చూస్తున్న తర్వాత చైతన్య ఇక నచ్చేసాడని సందీప్ రెడ్డి తెలిపారు.

ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ…నా అర్జున్ రెడ్డి ( Arjun Reddy )చిత్రంలోనే ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నా.మలయాళంలో సాయి పల్లవిని( Sai Pallavi ) అప్రోచ్ కావాలని ఒక కో ఆర్డినేటర్ ని అడిగా.ఇది చాలా రొమాంటిక్ మూవీ అని అతడితో చెప్పాను.
అయితే ఆయన సాయి పల్లవిని కూడా అప్రోచ్ కాకుండానే ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తారనే ఆశలను మీరు వదులుకోండి ఆమె కనీసం స్లీవ్ లెస్ కూడా వేసుకోరు అంటూ ఆ కోఆర్డినేటర్ చెప్పినట్టు సందీప్ రెడ్డి వెల్లడించారు.చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటిలో పద్ధతిగా ఉంటారు తర్వాత గ్లామర్ రోల్స్ చేస్తూ ఉంటారు.
అలాగే కొంతమంది పెద్ద ఆఫర్స్ వస్తే గ్లామర్ రోల్స్ లో నటించడానికి ఓకే చెబుతారు కానీ సాయి పల్లవి మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లయిన ఏ మాత్రం మారలేదు అదే సాయి పల్లవి గొప్పతనం అంటూ సందీప్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.