చేపలు( Fish ) తర్వాత సీ ఫుడ్ లో రొయ్యలే బాగా ఫేమస్.రొయ్యలతో రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు.
పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా రొయ్యలను తింటుంటారు.అయితే రొయ్యలు తింటే ఒంట్లో కొవ్వు పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.
ఈ క్రమంలోనే రొయ్యలను( prawns ) అవాయిడ్ చేస్తుంటారు.నిజంగా రొయ్యలు తింటే ఫ్యాట్ పెరుగుతుందా? అసలు రొయ్యలు ఆరోగ్యకరమా? కాదా? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తవానికి రొయ్యలు తక్కువ కొవ్వు ఉన్న ఆహారం కాబట్టి, వాటిని మితంగా తింటే అధిక బరువు లేదా కొవ్వు పెరిగే అవకాశం తక్కువ.వంద గ్రాముల రొయ్యల్లో సుమారు 1.5 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది.పైగా ఇందులో ఉన్న కొవ్వు ఎక్కువగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్( Omega-3 fatty acids ), ఇవి హృదయానికి మేలు చేసే కొవ్వులు.
హానికరమైన సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.అందువల్ల రొయ్యలను మితంగా తీసుకోవాలి.మరియు ఉడికించి, గ్రిల్ చేసి, తక్కువ నూనెతో వండుకుని తినాలి.ఇలా చేస్తే ఎటువంటి ఫ్యాట్ పెరగదు.

రొయ్యలు పోషకాహారంతో నిండిన ఆహారం.వీటిని మితంగా, ఆరోగ్యకరంగా వండుకుని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.రొయ్యల్లో కల్షియం ఎక్కువగా ఉంటుంది, ఇది ఎముకల బలాన్ని మెరుగుపరుస్తుంది.రక్తహీనతతో బాధపడేవారు వారానికి ఒకసారి రొయ్యలు తినడం మంచి ఎంపిక అవుతుంది.ఎందుకంటే, రొయ్యల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.ఇది హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది.

రొయ్యల్లో అధిక ప్రోటీన్ కంటెంట్ ( High protein content )కండరాలను బలంగా ఉంచి, శరీర శక్తిని పెంచుతుంది.రొయ్యల్లో ఉండే విటమిన్ బి12 మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.మతిమరపు, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.అయితే కొందరికి రొయ్యల వల్ల అలెర్జీ ఉండొచ్చు.అలాంటి వారు రొయ్యలను కంప్లీట్ గా దూరం పెట్టండి.అలాగే రొయ్యలను మితంగా తీసుకోండి.
అతిగా లేదా ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త!
.






