వారంలో ఒకే ఒక్క‌సారి ఇలా చేస్తే జుట్టు న‌ల్ల‌గా, పొడ‌వుగా పెరుగుతుంద‌ట‌!

న‌ల్ల‌టి పొడ‌వాటి జుట్టు కావాల‌ని దాదాపు ప్ర‌తి మ‌హిళా కోరుకుంటుంది.కానీ, ప్ర‌స్తుత రోజుల్లో ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, పోష‌కాల కొర‌త‌, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రోడెక్స్‌ను యూజ్ చేయ‌డం, త‌ల స్నానం స‌రిగ్గా చేయ‌క పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఏదో ఒక జుట్టు సంబంధిత స‌మ‌స్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

 Hair Growth, Black And Long Hair, Long Hair, Black Hair, Hair Care Tips, Hair Ca-TeluguStop.com

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను పాటిస్తే గనుక‌.కేవ‌లం కొద్ది రోజుల్లోనే న‌ల్ల‌టి పొడ‌వాటి జుట్టును పొందొచ్చు.

మ‌రి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

Telugu Black Long, Black, Care, Care Tips, Long, Natural Tips-Telugu Health - �

స్టెప్‌-1: ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఆముదం, రెండు స్పూన్ల విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు ప‌ట్టించి.ప‌ది నుంచి ఇర‌వై నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.గంట అనంత‌రం హెయిర్ ప్యాక్ వేసుకోవాలి.

స్టెప్‌-2: ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఫుల్ ఎగ్‌, రెండు టేబుల్ స్పూన్ల పెస‌ర పిండి, ఒక టేబుల్ స్పూన్ ఎండ బెట్టిన ఉసిరి కాయ పొడి, ఒక టేబుల్ స్పూన్ ఆముదం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.అనంత‌రం న‌ల‌బై లేదా యాబై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి.

అప్పుడు గోరు వెచ్చ‌ని నీటితో కెమిక‌ల్స్ లేని షాంపూ యూజ్ చేసి హెడ్ బాత్ చేయాలి.

Telugu Black Long, Black, Care, Care Tips, Long, Natural Tips-Telugu Health - �

ఇలా వారంలో ఒకే ఒక్క‌సారి చేశారంటే.మీ జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.చుండ్రు స‌మ‌స్య ప‌రార్ అవుతుంది.

మ‌రియు ఆయిలీ హెయిర్‌, డ్రై హెయిర్ స‌మ‌స్య‌లేమైనా ఉంటే త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube