ఒక్క సెంచరీ.. రికార్డులు ఎన్నో!

భారత క్రికెట్ జట్టు (Indian cricket team)మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.ఇంగ్లాండ్‌తో(England) జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను(T20 Series) 4-1 తేడాతో గెలుచుకుని, సొంత గడ్డపై భారీ విజయాన్ని నమోదు చేసింది.

 Abhishek Sharma's Single Century More Records In The T20 Series, Cricket, India-TeluguStop.com

ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐదో టీ20లో భారత జట్టు (Indian team)అద్భుత ప్రదర్శన కనబరిచింది.బ్యాటింగ్, బౌలింగ్‌లో పూర్తిగా ఇంగ్లాండ్‌ను కట్టడి చేసి భారీ విజయం సాధించింది.

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Team India opener Abhishek Sharma)అత్యద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం 54 బంతుల్లో 135 పరుగులు చేసి అనేక రికార్డులను తిరగరాశాడు.

మరి ఆ రికార్డ్స్ ఏంటో చూద్దామా.

Telugu Abhishek Sharma, Cricket, India England, Mumbai, Rohit Sharma, Shubman Gi

అభిషేక్ 13 సిక్సర్లు(Abhishek 13 sixes) కొట్టి, భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు.2017లో శ్రీలంకపై రోహిత్ శర్మ 10 సిక్సర్లు(Rohit Sharma hits 10 sixes against Sri Lanka) కొట్టిన రికార్డును అధిగమించాడు.అంతేకాకుండా కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి, టీ20 క్రికెట్‌లో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.

టాప్ ప్లేస్‌లో యువరాజ్ సింగ్ (12 బంతులు) ఉన్నాడు.ఆపై అభిషేక్(Abhishek) కేవలం 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, భారత క్రికెట్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు.

రోహిత్ శర్మ (35 బంతులు, 2017లో శ్రీలంకపై) ఈ జాబితాలో ముందుంది.

Telugu Abhishek Sharma, Cricket, India England, Mumbai, Rohit Sharma, Shubman Gi

అంతేకాకుండా అభిషేక్ చేసిన 135 పరుగులు.అంతర్జాతీయ టీ20ల్లో భారత ఆటగాడి అత్యధిక వ్యక్తిగత స్కోరు.ఇంతకు ముందు ఈ రికార్డు శుభ్‌మన్ గిల్ (126) 2023లో న్యూజిలాండ్‌పై చేసినది ఉండేది.

భారత జట్టు 6 ఓవర్లలో 95/1 స్కోర్ చేయడం ద్వారా, అత్యధిక పవర్ ప్లే స్కోర్‌ను నమోదు చేసింది.ఈ రికార్డు 2021లో స్కాట్లాండ్‌పై 82/2గా ఉండేది.భారత జట్టు చేసిన 247/9.టీ20 క్రికెట్ చరిత్రలో భారత్‌కు నాలుగో అత్యధిక స్కోరు.ఇంగ్లాండ్‌పై ఇది టీమ్ ఇండియా హయెస్ట్ స్కోర్.ఈ రికార్డ్స్ దెబ్బకు అభిషేక్ శర్మ తన అద్భుత ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా, వరుణ్ చక్రవర్తి తన మెరుపు బౌలింగ్‌తో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

ఈ విజయంతో టీమ్ ఇండియా మరోమారు టీ20 క్రికెట్‌లో తన సత్తా చాటింది.ముఖ్యంగా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube