చెన్నై లో సూపర్ స్టార్ అయిన సుధాకర్ ని అక్కడ నుండి ఎందుకు తరిమేశారు..?

కమెడియన్ సుధాకర్ గురించి చాలామందికి తెలుసు ఎందుకంటే ఆయన చేసిన క్యారెక్టర్స్ అలాంటివి మొదట్లో తెలుగులో హీరోగా చేశాడు తర్వాత విలన్ గా చేశాడు ఆ తర్వాత కామెడీ విలన్ గా చేశాడు తర్వాత కామెడీయన్ గా మారిపోయాడు.చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి సుధాకర్ ఇద్దరు రూమ్మేట్స్ గా ఉండేవారు వాళ్లు ఇద్దరం కలిసి ఒక ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ సంబంధించిన శిక్షణ తీసుకున్నారు ఇద్దరూ ఛాన్సుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే వారు చిరంజీవి కంటే ముందే సుధాకర్ కి పునాదిరాళ్లు సినిమాలో అవకాశం వచ్చింది కానీ అప్పటికే సుధాకర్ ని చూసిన భారతీరాజా గారు తమిళంలో అతను హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తాను అనడంతో పునాదిరాళ్లు అవకాశాన్ని వదులుకొని భారతీరాజా గారితో సినిమాకు కమిటయ్యారు అప్పటికి సుధాకర్ చేస్తానన్న పునాదిరాళ్లు సినిమాలో క్యారెక్టర్ ని చిరంజీవితో చేపించారు.

 Comedian Sudhakar Untold Story, Sudhaker, Chirenjeevi, Comedian, Tamil, Brain St-TeluguStop.com

సుధాకర్ తమిళంలో తీసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో అక్కడ హీరో గా కంటిన్యూ అయ్యారు వరుసగా 35, 40 సినిమాలు చేసి హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కానీ అంత గుర్తింపు ఉన్నటువంటి హీరోని ఎందుకు వదులుకోవడం, ఎక్కడో తెలుగు నుంచి వచ్చి తమిళంలో బాగా స్థిరపడ్డాడు అనుకున్న కొన్ని రాజకీయ పార్టీలు నువ్వు మా పార్టీలో జాయిన్ అవ్వు నీకు మంచి భవిష్యత్ ఉందని చెప్పడంతో తనకు పెద్దగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో సారీ నేను ఏ పార్టీలో చేరలేను నాకు సినిమానే ప్రస్తుతానికి ముఖ్యం అని చెప్పి తప్పించకున్నాడు.

దీంతో రాజకీయ పార్టీ మేము వచ్చి అడిగినా కూడా ఆయన మన పార్టీలో చేరలేకపోతున్నాడు అనే కోపంతో వీడు సినిమాలు ఎలా చేస్తాడు, మనల్ని కాదని సినిమా ఎలా రిలీజ్ చేస్తాడో చూద్దాం అన్నట్టుగా అతని మీద కక్ష కట్టి అతనితో ఎవరైనా సినిమాలు చేస్తే సినిమాలు రిలీజ్ అవ్వకుండా చేస్తామని ప్రొడ్యూసర్లని బెదిరించడం ఆల్రెడీ షూట్ అయిపోయిన సినిమాలను రిలీజ్ కానివ్వకుండా చేయడం లాంటివి చేసి మొత్తానికి సుధాకర్ ను బాగా ఇబ్బంది పెట్టారు ఇలా అయితే వర్కౌట్ కావట్లేదని సుధాకర్ తన సొంత ప్రొడక్షన్ లో సినిమా చేసినా కూడా ఆ సినిమా రిలీజ్ అవకుండా చేశారు.

Telugu Brain Stroke, Sudhakar, Sudhaker, Tamil-Telugu Stop Exclusive Top Stories

దాంతో సుధాకర్ నీ చూస్తే సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది సుధాకర్ ఇక్కడ మనకు లాభం లేదు అనుకొని తెలుగు లోకి వచ్చి హీరోగా కొన్ని సినిమాలు చేశాడు.హీరోగా కొద్దిరోజులు గుర్తింపు వచ్చినప్పటికీ తర్వాత హీరోగా వేషాలు తగ్గిపోవడంతో కమెడియన్ గా స్థిరపడ్డాడు.చిరంజీవితో తో హిట్లర్, ఇద్దరు మిత్రులు లాంటి సినిమాలు చేసి కమెడియన్ గా మంచి గుర్తింపు సాధించాడు అలాగే వెంకటేష్ పక్కన ఫ్రెండ్ గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపు సాధించుకున్నాడు ముఖ్యంగా ముప్పలనేని శివ దర్శకత్వంలో వెంకటేష్ సౌందర్య నటించిన రాజా సినిమా లో వెంకటేష్ ఫ్రెండ్ గా నటించి చివర్లో సెంటిమెంట్ సీన్లు బాగా పండించాడు.

పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమాలో నటించాడు.కమెడియన్ గా బిజీగా అయిపోయాడు సుధాకర్ అలాంటప్పుడే ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం తో చాలా ఇబ్బంది పడ్డాడు కొన్ని రోజులు కోమాలోనే ఉండిపోయాడు.

కోమా నుంచి బయటకు వచ్చినప్పటికీ తన ఫేస్ మొత్తం మారిపోయింది సినిమాల్లో చేద్దాం అన్న కూడా చేయలేనంత విధంగా ఫేస్ మారిపోవడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు ఒకప్పుడు చాలా అందంగా ఉండే సుధాకర్ సినిమాలో తన అందాన్ని కోల్పోవడంతో అవకాశాలు రాకపోవడంతో కొంత వరకు బాధ పడుతున్నాడని అర్థమవుతుంది.ఒకప్పుడు చిరంజీవి తన రూమ్మేట్స్ గా ఉన్నామని చిరంజీవి మెగాస్టార్ అయిన తర్వాత తనకు బాగా హెల్ప్ చేశారని సుధాకర్ చాలాసార్లు చెప్పాడు అలాగే సుధాకర్ ప్రొడక్షన్లో చిరంజీవి హీరోగా యముడికి మొగుడు సినిమా కూడా చేశారు.

ఏదిఏమైనా ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలిగిపోయిన సుధాకర్ పరిస్థితి ఇప్పుడు ఇలా అవ్వడం చాలా బాధాకరమైన విషయం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube