ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగడం విశేషం…ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కూడా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.
మరి వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నంతో తమదైన రీతిలో భారీ క్రేజ్ ను అయితే సంపాదించుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే సీనియర్ హీరోలు ( Senior heroes )సైతం ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.అఖండ 2 సినిమాని ( Akhanda 2 movie )పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి బాలయ్య బోయపాటి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.మరి ఈ సినిమా కనక పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయితే బాలయ్య మార్కెట్ భారీగా పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇప్పటికే ‘డాకు మహారాజ్’ సినిమాతో( Daku Maharaj’ ) తెలుగు ప్రేక్షకులను అలరించి వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ‘అఖండ 2’ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇప్పటికే బోయపాటి ఈ సినిమాని చాలా పెద్ద స్కెల్ లో తీస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి తను అనుకున్నది అనుకున్నట్టుగా చిత్రీకరించగలిగితే సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చుతుందని బోయపాటి తన సన్నిహితుల దగ్గర తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది.మరి బోయపాటి డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఒక మంచి కథ ఉంటే ఆయన దానిని అద్భుతంగా తెరకెక్కిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి బాలయ్య పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది…
.