సినీనటి సాయి పల్లవి(Sai pallavi) ప్రస్తుతం సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.అయితే తాజాగా ఈమెకు సంబంధించి ఒక విషయాన్ని డైరెక్టర్ చందు మొండేటి (Chandu Mondeti) తెలియచేయడంతో అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య(Sai Pallavi ,Naga Chaitanya) హీరో హీరోయిన్లుగా నటించిన తండేల్ (Thandel)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.

ఇక ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు సాయి పల్లవి దూరంగా ఉన్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్లకు దూరంగా ఉండడానికి గల కారణాలను ఈయన వెల్లడించారు.గత కొద్ది రోజుల క్రితం వైజాగ్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.అప్పుడు కూడా సాయి పల్లవి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు ఇటీవల చెన్నైలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మాత్రమే ఈమె హాజరయ్యారు.ఇక నిన్న ముంబైలో నిర్వహించినటువంటి ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి కూడా సాయి పల్లవి హాజరు కాలేదు.

ఇలా సాయి పల్లవి ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆమెకు అనారోగ్య సమస్య వచ్చిందని అందుకే ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని డైరెక్టర్ తెలియజేశారు.ప్రస్తుతం సాయి పల్లవి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు.ఇప్పటికే ఆమె పూర్తిగా నీరసించి పోయారు… ప్రస్తుతం తనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సలహా ఇచ్చిన నేపథ్యంలోనే సాయి పల్లవి ఈ ప్రమోషన్ కార్యక్రమాలకు రాలేకపోయారని డైరెక్టర్ తెలియజేశారు.ఇలా సాయి పల్లవి ఆరోగ్యం గురించి ఈయన చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో ఈమె తొందరగా కోలుకోవాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇక సాయి పల్లవి నాగచైతన్య కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి ఈ సినిమా తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.