ఈ గ్రీన్ జ్యూస్ డైట్ లో ఉంటే ఆకలి తగ్గుతుంది.. కొవ్వు కరుగుతుంది..!!

స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఎంతో మంది బాన పొట్టతో బాధపడుతున్నారు.పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ను కరిగించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

 This Green Juice Melts Belly Fat! Green Juice, Belly Fat, Latest News, Immunity-TeluguStop.com

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే గ్రీన్ జ్యూస్ ( Green juice )చాలా బాగా సహాయపడుతుంది.ఈ గ్రీన్ జ్యూస్ డైట్ లో ఉంటే అతి ఆకలి తగ్గుతుంది.

అదే సమయంలో పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు సైతం కరుగుతుంది.మరి ఇంకెందుకు లేటు ఫ్యాట్ ను కట్ చేసే ఆ గ్రీన్ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా చిన్న కీర దోసకాయ( Cucumber) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి తొక్క తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండ‌ర్‌ తీసుకుని అందులో కట్ చేసుకున్న కీర దోసకాయ స్లైసెస్ వేసుకోవాలి.అలాగే ఒక చిన్న కప్పు పైనాపిల్ ముక్కలు, ఒక చిన్న కప్పు గ్రీన్ ఆపిల్ ముక్కలు, ప‌ది ఫ్రెష్ పుదీనా ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ) మరియు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి నేరుగా సేవించాలి.

ఈ గ్రీన్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా నిత్యం ఈ జ్యూస్ ను తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.అలాగే ఈ జ్యూస్ ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.ఆకలి కోరికలను అణచివేస్తుంది.అధిక బరువు సమస్య నుంచి బయటపడేందుకు సహాయపడుతుంది.

అలాగే ఈ గ్రీన్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.ఇమ్యూనిటీ పవర్( Immunity power ) పెరుగుతుంది.

స్కిన్ గ్లోయింగ్ గా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube