డెలివరీ తర్వాత పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ కనపడుతున్నాయా.. ఈ ఆయిల్ రాశారంటే నెల రోజుల్లో మాయం అవుతాయి!

దాదాపు ప్రతి మహిళా పెళ్లి తర్వాత ఏదో ఒక సమయంలో అమ్మ అనే పిలుపు కోసం ఆరాటపడుతుంది.అయితే ఓ బిడ్డకు జన్మనిచ్చి అమ్మ కావడం అనుకున్నంత సులభం కాదు.

 Try This Magical Oil For Removing Stretch Marks Stretch Marks, Stretch Marks Re-TeluguStop.com

ప్రెగ్నెన్సీ జర్నీ(Pregnancy Journey) ఒక ఎత్తయితే.డెలివరీ మరియు డెలివరీ తర్వాత ఎదురయ్యే సమస్యలు మరొక ఎత్తు.

అయితే డెలివరీ తర్వాత దాదాపు మహిళలందరికీ పొట్టపై స్ట్రెచ్ మార్క్స్(Stretch marks) ఏర్పడుతుంటాయి.ఇవి చాలా అసహ్యంగా కనిపిస్తాయి.

ఈ క్రమంలోనే కొందరు స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

Telugu Tips, Latest, Magical Oil, Skin Care, Skin Care Tips, Stretch Oil-Telugu

అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ ఎంతో ఉత్త‌మంగా సహాయపడుతుంది.రోజు నైట్ ఈ ఆయిల్ ను పొట్టపై అప్లై చేశారంటే నెల రోజుల్లో స్ట్రెచ్ మార్క్స్ మాయం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అర కప్పు ఆలివ్ ఆయిల్(Half a cup of olive oil) ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు విటమిన్ ఈ ఆయిల్, చిటికెడు కుంకుమ పువ్వు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి.

ఆపై మూత పెట్టి ఒక రోజంతా వదిలేయాలి.

Telugu Tips, Latest, Magical Oil, Skin Care, Skin Care Tips, Stretch Oil-Telugu

ఇప్పుడు ఈ ఆయిల్ ను నైట్ నిద్రించే ముందు పొట్టపై అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.అలాగే స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ఇతర శరీర భాగాల్లో కూడా ఆయిల్ ను అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.

ఈ విధంగా నిత్యం కనుక చేశారంటే స్ట్రెచ్ మార్క్స్ క్రమంగా మాయమవుతాయి.సాగిన చర్మం టైట్ గా మారుతుంది.

స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించడానికి ఈ ఆయిల్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.కావాలి అంటే మీరు ఈ ఆయిల్ ను ముఖానికి కూడా అప్లై చేయవచ్చు.

ఫేస్ కు అప్లై చేయడం వల్ల ముడతలు, చారలు ఉంటే త‌గ్గుముఖం పడతాయి.స్కిన్ గ్లోయింగ్ గా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube