సికింద్రాబాద్ లో హైటెన్షన్.. వారిపై లాఠీ చార్జీ

సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో( Muthyalamma Temple ) ఉన్న విగ్రహాన్ని మరో అన్య మతస్థుడు తన్ని ధ్వంసం చేశారు.ఈ సమస్యకు సంబంధించిన సంఘటనలు పెద్ద సమస్యగా మారాయి.

 Police Lathi Charge On Protestors At Secunderabad Muthyalamma Temple Details, Hy-TeluguStop.com

ఈ ఘటనపై హిందూ సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవగా, సలీం అనే నేరస్తుడిని స్థానికులు దాడి చేసి పోలీసులకు అప్పగించారు.పోలీసుల విచారణలో అతడు పొంతన లేకుండా మాట్లాడినట్లు అధికారులు గుర్తించారు.

ఇకపోతే, ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ హిందూ సంస్థలు ఈరోజు సికింద్రాబాద్‌లో బంద్ కి( Secunderabad Bandh ) పిలుపునిచ్చాయి.హిందువులు పెద్ద ఆలయానికి చేరుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఈ ఘటనకు కారణమైన సలీంను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని, అలంటి వారిని జైలులో వేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇకపోతే నిందితుడు సలీమ్‌తో పాటు, హిందు మతానికి వ్యతిరేకంగా సెమినార్ నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన లాడ్జ్‌కు వెళ్లడానికి ప్రయత్నించారు.

తద్వారా ఇతర వర్గాలు హిందూ మతంపై కోపం తెచ్చుకున్నారు.దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పెద్ద సంఖ్యలో నిరసన కారులు అక్కడ గుమిగూడి నినాదాలు చేశారు.కానీ., కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.హిందువులపై దాడికి దిగుతున్నారు.దాని ఫలితంగా అల్లర్లు చెలరేగాయి.పోలీసులు అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నెట్ ను స్తంభింప చేసారు.

ఇదిలా ఉండగా.పోలీసుల దాడులను హిందూ సంఘాలు ఖండించాయి.

ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఇంతవరకు స్పందించలేదని హిందూ సంఘాలు విమర్శిస్తున్నాయి.చూడాలి మరి చివరకు ఈ ఘర్షణలు ఎంతవరకు దారి తీస్తాయో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube