జనసేన లోకి వారంతా క్యూ ... టీడీపీ నేతల్లో ఆగ్రహం ? 

ఏపీ ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరమితమైన ( YCP ) రోజురోజుకు బలహీనం అవుతున్నట్టు గా కనిపిస్తోంది.ఆ పార్టీలో కీలక నేతలనుకున్న వారంతా ఇతర పార్టీలలో చేరిపోతుండడంతో వైసిపిలో ఆందోళన కలుగుతుంది.

 Que Tdp Leaders Who Want To Join Jana Sena, Tdp, Janasena, Bjp, Ap Government, A-TeluguStop.com

వైసీపీ నుంచి కూటమి పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.అయితే వైసీపీ నుంచి మొదట్లో బయటికి వచ్చిన వారంతా టిడిపిలో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు.

తమ తమ నియోజకవర్గాల్లో పరిస్థితులకు అనుగుణంగా బిజెపి,  టిడిపి , జనసేన ( BJP, TDP, Jana Sena )లో ఏదో ఒక పార్టీలో చేరుతూ వచ్చారు.అయితే తాజాగా బీజేపీ , జనసేనలలో చేరికలు ఊపందుకోవడం పై టిడిపి నేతలకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందట.

దీనికి కారణం గత వైసిపి ప్రభుత్వం అన్ని రకాలుగా వేధింపులకు గురిచేసిన నేతలను జనసేన , బీజేపీలు చేర్చుకోవడంపై టిడిపి నేతలు ఆగ్రహం వద్ద చేస్తున్నారు.వైసిపి రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు మొదట్లో టిడిపిలో చేరారు.

ఇక ఆ పార్టీలోని కీలక నేతలుగా గుర్తింపు పొందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి , సామినేని ఉదయభాను ( Balineni Srinivas Reddy, Samineni Udayabhanu )వంటి వారు జనసేనలో చేరారు .

Telugu Adari Anand, Alla Nani, Ap, Janasena-Politics

బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడంపై ఒంగోలు టిడిపి నేతలు ఇప్పటికీ అసంతృప్తితోనే ఉన్నారు.  స్థానికంగా టిడిపి నేతలు( TDP leaders ) ఎవరు బాలినేని తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేము అనే సంకేతాలను ఇస్తున్నారు.ముఖ్యంగా అక్కడ దామచర్ల జనార్ధన్ బాలినేని విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు .ఇక ఏలూరు నియోజకవర్గం విషయానికి వస్తే వైసీపీలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని ఇటీవల వైసీపీ పార్టీకి,  పదవులకు రాజీనామా చేసి టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు.అయితే ఆయనను చేర్చుకునేందుకు స్థానిక టిడిపి నేతలు సిద్ధంగా పేరు ఈ చెరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు .దీంతో ఆయన జనసేన లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.అలాగే వైసిపి కీలక నేతగా ఉన్న విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ బిజెపిలో చేరడంపైన టిడిపి అసంతృప్తితో ఉంది .ముఖ్యంగా ఈ విషయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చంద్రబాబు వద్ద ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్లిన నేతలు మళ్లీ ఇప్పుడు జనసేనలో చేరుతున్నారు.

మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవికి పవన్ కళ్యాణ్ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.  మొదట్లో టిడిపిలో ఉన్న చిరంజీవి ఆ తర్వాత వైసీపీలో,  మళ్ళీ ఇప్పుడు జనసేనలో చేరారు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ( Nara Lokesh )పైన పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఆ సమయంలో లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసారు.ఇప్పుడు అటువంటి చిరంజీవ జనసేన లో చేర్చుకోవడంపై టిడిపి నేతలు మండిపడుతున్నారు.

Telugu Adari Anand, Alla Nani, Ap, Janasena-Politics

అలాగే కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ కూడా వైసీపీ నుంచి జనసేనలో చేరారు.  దీనిపై కైకలూరు టిడిపి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.కూటమిలో ఉన్న టిడిపి , జనసేన, బిజెపిలు కలిసి ఉంటూనే విడివిడిగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ పరిణామాలే అంతర్గతంగా మూడు పార్టీలలో చిచ్చు రేపుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube