సాధారణంగా కొందరు డార్క్ బ్లాక్ అండ్ షైనీ హెయిర్( Shiny hair ) కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే జుట్టును ఆ విధంగా మెరిపించుకునేందుకు హెయిర్ డైయింగ్ చేయించుకుంటారు.
అయితే కలర్ వేసుకోవడం వల్ల తీవ్రమైన తలనొప్పి, జుట్టు ఆరోగ్యం దెబ్బ తినడం, హెయిర్ ఫాల్ వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.కానీ తల స్నానం చేసేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ట్రిక్ ను పాటిస్తే సహజంగానే మీ జుట్టు నల్లగా షైనీ గా మెరిసిపోతుంది.
అదే సమయంలో మరికొన్ని బెనిఫిట్స్ కూడా పొందుతారు.
బ్లాక్ అండ్ షైనీ హెయిర్ పొందడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు టీ పొడి, వన్ టేబుల్ స్పూన్ బియ్యం, కొన్ని ఎండిన ఉసిరి కాయ ముక్కలు వేసుకొని ఉడికించాలి.దాదాపు పది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ గోరువెచ్చగా ఆయన తర్వాత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూ వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ వాటర్ ని ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మీ జుట్టు మరింత నల్లగా మరియు షైనీ గా మెరుస్తుంది.తెల్ల జుట్టు సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.కురులు స్మూత్ గా మారతాయి.అలాగే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి.
జుట్టు రాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.టీ పొడిలోని యాంటీ ఆక్సిడెంట్లు స్కాల్ప్‌ను శాంతపరచి, మంటను తగ్గించి, చుండ్రు మరియు స్కాల్ప్ చికాకును నివారించడానికి సహాయపడతాయి.
అంతేకాకుండా పైన చెప్పిన విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే మీ కురులకు సహజమైన షైన్ లభిస్తుంది.మరియు జుట్టు ఆరోగ్యంగా దృఢంగా మారుతుంది.