టీ చేసే అద్భుతాలు.. తలనొప్పి, నిద్రలేమితో సహా ఏ సమస్యకు ఏ టీ తాగాలో తెలుసా?

టీ.అనేది ఒక ఎమోషన్.ఒక రిఫ్రెషింగ్ డ్రింక్.మనలో ఎంతో మంది తమ రోజును టీ తోనే ప్రారంభిస్తుంటారు.అయితే టీ అనగానే పాలు, చక్కెర, టీ పొడి గుర్తుకు వస్తాయి.కానీ టీ లో ఎన్నో రకాలు ఉన్నాయి.

 Do You Know Which Tea To Drink For Any Problem? Headache, Insomnia, Tea, Cold, O-TeluguStop.com

మిల్క్ టీ కంటే కొన్ని రకాల హెర్బల్ టీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.మనం రోజువారి ఎదుర్కొనే పలు సమస్యలకు మంచి ఔషధంగా మారుతాయి.

ఈ నేపథ్యంలోనే ఏ సమస్యకు ఏ టీ తాగితే పరిష్కారం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Cinnamon Tea, Tea, Ginger Tea, Green Tea, Headache, Hibiscus Tea, Insomni

ఉరుకుల పరుగుల జీవితంలో దాదాపు అందర్నీ అత్యంత కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో తలనొప్పి( Headache ) ముందు వరుసలో ఉంటుంది.తలనొప్పి వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్ వేసుకోవడం కరెక్ట్ కాదు.సహజంగా తలనొప్పిని వదిలించుకునేందుకు ప్రయత్నించాలి.

అందుకు లవంగం టీ చాలా బాగా సహాయపడుతుంది.తలనొప్పి విపరీతంగా వస్తున్నప్పుడు ఒక కప్పు లవంగం టీ తాగితే మంచి రిలీఫ్ పొందుతారు.

అలాగే కొందరు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతూ ఉంటారు.అలాంటివారికి మందారం టీ చాలా మేలు చేస్తుంది.

అధిక రక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.అయితే నిత్యం ఒక కప్పు మందారం టీ తాగడం వల్ల రక్తపోటు స్థాయిలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

ఇటీవల రోజుల్లో ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతున్నారు.అధిక స్క్రీన్ టైమ్‌, ఒత్తిడి, మద్యపానం అలవాటు తదితర అంశాలు అందుకు కారణం అవుతున్నాయి.

అయితే నిద్రలేమి సమస్య( Insomnia problem ) నుంచి బయటపడటానికి దాల్చిన చెక్క టీ తోడ్పడుతుంది.రోజు నైట్ నిద్రంచ‌డానికి గంట ముందు ఒక కప్పు దాల్చిన చెక్క టీ తాగితే మంచిగా నిద్ర పడుతుంది.

Telugu Cinnamon Tea, Tea, Ginger Tea, Green Tea, Headache, Hibiscus Tea, Insomni

అధిక బరువుతో సతమతం అవుతున్న వారికి గ్రీన్ టీ బెస్ట్ ఆప్షన్.రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే శరీరం బరువు అదుపులోకి రావడమే కాకుండా గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.చర్మ నిగారింపుగా మెరుస్తుంది.వాంతులు వికారం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక కప్పు అల్లం టీ తీసుకోవాలి.అల్లం టీ ( Ginger Tea )ఆయా సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా ఆకలిని పెంచుతుంది.

జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు పసుపు టీ ను ఎంపిక చేసుకోవాలి.పసుపులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

జలుబు దగ్గు సమస్యల‌ను వేగంగా తరిమి కొడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube