గంజాయి, మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో ప్రతి విద్యార్థులు భాగస్వామ్యం కావాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( District SP Akhil Mahajan ) ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన కల్పించిన ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్.

 Every Student Should Participate In Driving Away Marijuana And Intoxicants , Dis-TeluguStop.com

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు.

మత్తు పదార్థాలకు మానసికంగా బానిస కావడం ద్వారా అనుకోకుండా నేరాలు చేసే అవకాశం ఉంటుందని, యువత విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలను తరిమికొట్టడంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్బంగా విద్యార్థులకు పిలుపునిచ్చారు.మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వెయ్యాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిఎస్ఎన్ఎబి ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి,, ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ ఎన్.రమాకాంత్,కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube