మొదటి బంతికే 15 పరుగులు.. ఎలా అంటే? (వీడియో)

సాధారణంగా క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి అంటే.క్రికెట్ లవర్స్ అందరూ కూడా టీవీకి అతుక్కుపోతారు.

 Bpl Bowler Gives Away 15 Runs One Ball Bizarre Event Video Viral Details, Viral-TeluguStop.com

ఇక క్రికెట్ మ్యాచ్లలో భాగంగా వివిధ రకాల వీడియోలు, ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్( Viral ) అవుతూనే ఉంటాయి.కొన్ని సందర్భాలలో బ్యాటర్స్, బౌలర్ చేసే విచిత్ర ప్రయత్నాలు, వారు సాధించే రికార్డులకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

ఇందులో భాగంగానే తాజాగా జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో( Bangladesh Premier League ) జరిగిన ఈ ఘటన నిజంగా క్రికెట్ అభిమానులకు ఆసక్తికరంగా మారింది.

ఒషేన్ థామస్( Oshane Thomas ) బౌలర్ మొదటి బంతికే 15 పరుగులు ఇచ్చిన ఈ విచిత్రమైన ఓవర్ గురించి వినడం మాత్రమే కాదు.వీడియో చూసినవారు ఆశ్చర్యంతో పాటు వినోదాన్ని కూడా పొందుతున్నారు.అలాగే మెహిదీ హసన్ మిరాజ్ నేతృత్వంలోని జట్టు 37 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన ఖుల్నా టైగర్స్ 203/4 స్కోర్ చేయగా చిట్టగాంగ్ కింగ్స్ 166 పరుగులకు ఆలౌటైంది.

ఈ మ్యాచ్‌లో మొదటి ఓవర్‌‌లోనే తొలి బంతికే NB, 0, NB+6, WD, WD, NB+4 వేశాడు.ఈ బౌలర్ 1 ఓవర్ వేసి 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీశాడు.అయితే సోషల్ మీడియాలో ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతూ ఉంది.

ఇక ఈ వీడియో చుసిబా చాలా మంది.ఏది సామీ ఇలా ఉన్నావ్ నువ్వు అంటూ కామెంట్లు చేస్తూ ఉంటె, మరికొందరు సెటైరికల్ కామెంట్లు పెడుతూ ఉన్నారు.

ఏది ఏమైనా కానీ ఈ బౌలర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.ఇంకెందుకు క్రికెట్ అభిమానులు వీడియో చూసి మీకేమనిపించిందో ఒక కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube