ఈ పొడిని నిత్యం తీసుకుంటే మీ కంటి చూపు పెరగడం గ్యారెంటీ!

ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న వయసులోనే కంటి సంబంధిత సమస్యలను( Eyesight Problems ) ఎదుర్కొంటున్నారు.అధిక స్క్రీన్ టైమ్ ఇందుకు ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

 Regular Consumption Of This Powder Is Guaranteed To Improve Your Eyesight Detail-TeluguStop.com

అయితే కంటి చూపును పెంచడానికి మనకు అందుబాటులో ఎన్నో ఆహారాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పొడిని నిత్యం తీసుకుంటే మీ కంటి చూపు పెరగడం గ్యారెంటీ.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం గింజలు( Almonds ) వేసి దోరగా వేయించుకోవాలి.ఆ తర్వాత అదే ప్యాన్ లో నాలుగు టేబుల్ స్పూన్లు సోంపు( Fennel Seeds ) వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న బాదం గింజలు, సోంపు తో పాటుగా పది మిరియాలు, పావు కప్పు పటిక బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

Telugu Almondfennel, Almonds, Eyes, Powder, Fennel Seeds, Tips, Jaggery, Latest,

ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో వన్ టీ స్పూన్ తయారు చేసుకున్న బాదం-సోంపు పొడి కలిపి తీసుకోవాలి.సోంపు గింజలలో విటమిన్ ఎ( Vitamin A ) ఉంటుంది, ఇది కంటి ఆరోగ్యానికి మరియు దృష్టికి ముఖ్యమైనది.బాదం పప్పులో విటమిన్ ఇ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి, ఇవి దృష్టి లోపాలను తగ్గిస్తాయి.కంటి చూపును మెరుగు పరుస్తాయి.

Telugu Almondfennel, Almonds, Eyes, Powder, Fennel Seeds, Tips, Jaggery, Latest,

అలాగే బాదం సోంపు పొడి మెదడు పనితీరును పెంచుతుంది.ఒత్తిడి ఆందోళన వంటి మానసిక సమస్యలను దూరం చేసి జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తిని రెట్టింపు చేయడంలో తోడ్పడుతుంది.బాదం సోంపు పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి.ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతాయి.

అంతే కాకుండా ఈ పొడి శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది.జీర్ణక్రియను చురుగ్గా మార్చి మలబద్ధకాన్ని నివారిస్తుంది.

నీరసం, అలసట వంటి సమస్యలను దూరం చేస్తుంది.శరీరానికి తక్షణ శక్తిని చెకురుస్తుంది.

నిద్రలేమితో బాధపడుతున్న వారికి కూడా ఈ పొడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.రోజు నైట్ ఈ పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే మంచిగా నిద్ర పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube