జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా ఉండాలని అందరూ కోరుకుంటారు.కానీ, నేటి కాలంలో చాలా మంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా హెయిర్ ఫాల్ ఎందరినో వేధించే సమస్య ఇది.చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం వల్ల మానసికంగా కృంగిపోతున్న వారు ఎందరో.కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, విటమిన్ల లోపం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు రాలిపోతుంటుంది.అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు ఫాల్ అయితే.
ఎంత పలచని జుట్టు అయినా ఒత్తుగా, పొడవుగా మారుతుంది.

మరి ఆ టిప్స్ ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయడంలో ఉల్లిపాయ, కలబంద అద్భుతంగా సహాయపడుతుంది.ఉల్లిపాయ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకుని రసం తీసుకోవాలి.
ఆ ఉల్లిపాయ రసంలో కొద్దిగా కలబంద గుజ్జు వేసి మిక్స్ చేసుకుని జుట్టుకు అప్లై చేయాలి.అరగంట లేదా గంట తర్వాత తలస్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
అలాగే రెండొవది బాగా పండిన అరటి పండు పేస్ట్‌లో ఎగ్ వైట్ మరియు నిమ్మ రసం వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కేశాలకు అప్లై చేసి.గంట పాటు ఆరనివ్వాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.ఇలా మూడు రోజులకు ఒక సారి చేస్తే జుట్టు రాలడం తగ్గడంతో పాటు ఒత్తుగా ఎదుగుతుంది.
ఇక కొబ్బరి పాలు కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.కొబ్బరి పాలలో కొద్దిగా మెంతులు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
ఉదయాన్నే దాన్ని మిక్సీ పట్టుకుని జుట్టుకు అప్లై చేసి గంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేసేయాలి.
ఇలా తరచూ చేసినా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.