ఉద‌యం పూట‌ ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యం మీవెంటే!

ఫ‌స్ట్ మీల్ ఎప్పుడూ బెస్ట్‌గా ఉండాల‌ని అంటుంటారు.అంటే ఉదయం తీసుకునే మొద‌టి ఆహారం అదేనండీ బ్రేక్ ఫాస్ట్ లో పోష‌కాల‌తో నిండి ఉండే ఆహారాల‌నే చేర్చుకోవాలి.

 Best And Healthiest Foods For Breakfast! Healthiest Foods, Breakfast, Latest New-TeluguStop.com

అప్పుడే శరీరం రోజంతా పని చేయడానికి అవసరమైన శక్తిని పొందుతుంది.అలాగే బ్రేక్ ఫాస్ట్ మ‌న ఆరోగ్యాన్ని సైతం ప్ర‌భావితం చేస్తుంది.

అయితే చాలా మందికి ఉద‌యం పూట ఏయే ఆహారాలు తినాలో తెలియ‌క‌.ఏవి ప‌డితే అవి లాగేంచేస్తుంటారు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ఫుడ్స్‌ను తీసుకుంటే ఆరోగ్యం మీవెంటే ఉంటుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ప్రస్తుతం స‌మ్మ‌ర్ సీజ‌న్ కొన‌సాగుతోంది కాబ‌ట్టి.బ్రేక్ ఫాస్ట్‌లో పండ్ల‌కు తీసుకోవ‌చ్చు.అయితే అన్ని పండ్లూ కాదండోయ్‌.బొప్పాయి, యాపిల్‌, పుచ్చ‌కాయ వంటి పండ్లను బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవ‌చ్చు.

వాటితో హెల్తీగా స్మూతీని త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు.ఈ పండ్లు బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి, జీర్ణ వ్య‌వ‌స్థ‌ను చురుగ్గా మారుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు సైతం ఈ పండ్ల‌కు పుష్క‌లంగా ఉన్నాయి.

అలాగే బ్రేక్ ఫాస్ట్‌లో ఉడికించిన గుడ్డును తీసుకుంటే ఎంతో మంచిది.రోజూ ఒక‌ గుడ్డును తీసుకుంటే బోలెడంత శ‌క్తి లభిస్తుంది.శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్‌తో స‌హా ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి.ఉడికించిన గుడ్డును తిన‌లేని వారు ఆమ్లెట్ రూపంలో కూడా తీసుకోవ‌చ్చు.

Telugu Ajwain Tea, Boiled Egg, Breakfast, Foods, Fruits, Tips, Latest, Nuts-Telu

వాముతో త‌యారు చేసిన టీ ఆరోగ్యానికి చాలా మంచిది.బ్రేక్ ఫాస్ట్ స‌మ‌యంలో రోజుకో క‌ప్పు వాముతో చేసిన టీని తీసుకుంటే బాడీ డిటాక్స్ అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.ఇక బ్రేక్ ఫాస్ట్‌లో న‌ట్స్ కూడా మంచి ఎంపిక‌.బాదం, వాల్ న‌ట్స్ వంటి న‌ట్స్‌ను నైట్ నీటిలో నాన‌బెట్టుకుని.

ఉద‌యం పూట తీసుకుంటే గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.మెద‌డు చురుగ్గా మారుతుంది.

ఎముక‌ల‌ దృఢత్వం రెట్టింపు అవుతుంది.మ‌రియు రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు కావాల్సిన ఎన‌ర్జీ సైతం ల‌భిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube