27 సంవత్సరాలలో మొదటిసారి దీపావళి రోజున సూర్యగ్రహణం ఈ పనులు చేస్తే ప్రమాదంలో పడినట్టే..

ఈ సంవత్సరం చివరి పాక్షిక సూర్యగ్రహణం అక్టోబర్ 25 వ తేదీన అంటే సరిగ్గా దీపావళి రోజు వచ్చే అవకాశం ఉంది.ఈ సంవత్సరం దీపావళిని చతుర్దశియుక్త అమావాస్య రోజు జరుపుకునే అవకాశం ఉంది.

 This Year Diwali On Solar Eclipse Dont Do These Things On This Day Details, Diwa-TeluguStop.com

దీపావళి పండుగ రోజు అక్టోబర్ 24న సూర్యగ్రహణం ఏర్పడుతుంది.సూర్యగ్రహణం అమావాస్య తిధి నాడు వస్తుంది కాబట్టి దీపావళి పండుగ కూడా అమావాస్య రోజున వచ్చే అవకాశం ఉంది.

ఈసారి దీపావళి రాత్రి నుంచే సుతక కాల్ ప్రారంభం కావడం సాధారణంగా జరుగుతుంది.గ్రహణం సూతకం అక్టోబర్ 24 అర్ధరాత్రికి 12 గంటల ముందు మొదలవుతుంది.

సూతక కాలం దీపావళి రోజు అక్టోబర్ 24 రాత్రి 02:30 గంటలకు మొదలై అక్టోబర్ 25 ఉదయం 04:22 వరకు కొనసాగే అవకాశం ఉంది.సూర్యగ్రహణం భారతదేశంలో పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది.సూర్యగ్రహణం అక్టోబర్ 25 మధ్యాహ్నం 02:29 నుండి మొదలై సాయంత్రం 06.32 వరకు కొనసాగుతుంది.ఈ సూర్యగ్రహణం 4 గంటల 3 నిమిషాల పాటు కొనసాగే అవకాశం ఉంది.శాస్త్రాల ప్రకారం, 27 సంవత్సరాల క్రితం 1995లో దీపావళి రోజునే సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడిందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సూర్యగ్రహణం జరిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచి విషయం.

మనదేశంలో ప్రజలు సాధారణంగా ఇంట్లోనే ఉండి సూర్యగ్రహణం సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోరు, ఇదే కాకుండా దర్భ గడ్డి లేదా తులసి ఆకులను తిని నీళ్లలో వేస్తే గ్రహణ దుష్ఫలితాలు రాకుండా ఉండే అవకాశం ఉంది.గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలని చాలా మంది ప్రజల నమ్మకం.ఇంకా చెప్పాలంటే తమ ఇళ్లలో సూర్యదేవుని మంత్రాలను ప్రజలు పఠించాలి.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇళ్లలోనే ఉండి సంతాన్ గోపాల్ మంత్రాన్ని చదువుతూ ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు.గ్రహణ సమయంలో మరి కొంతమంది వంట చేయడం, తినడం నిషేధించబడింది.

Dos and Don'ts on Diwali Festival Day

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube