ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ( Kanaka Durgamma Temple ) అమ్మవారి దేవాలయం అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.216 కోట్ల రూపాయల విలువైన పలు పనులకు శ్రీకారం చుట్టారు.ముఖ్యంగా కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో అన్న ప్రసాద భవనం 30 కోట్లు,అమ్మవారి లడ్డూ ప్రసాదం పోటు భవనం 27 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి శంకుస్థాపన పనులు మొదలుపెట్టారు.దేవస్థానం నిధులు 13 కోట్ల రూపాయలతో కనకదుర్గ నగర్ నుంచి మహా మండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మిస్తారని చెబుతున్నారు.

అలాగే రాజగోపురం ముందు మెట్ల నిర్మాణం 23.5 కనకదుర్గనగర్ ప్రవేశం ద్వారం, మహారాజా ద్వారం 7.75 కోట్లు, పూజా మండపం 7 కోట్లు, మల్లికార్జున మహా మండపం క్యూ కాంప్లెక్స్ 18.30 కోట్లు,నూతన కేశఖండనశాల 19 కోట్లు, గోశాల వద్ద మల్టీ పర్పస్ కాంప్లెక్స్ 10 కోట్ల రూపాయలతో నిర్మించనుంది.దాతల సహకారంతో అమ్మవారి దేవాలయం నుంచి మల్లేశ్వర స్వామి( Malleswara Swamy ) వారి ఆలయంలోకి చేరుకునే మార్గంలో ఐదు కోట్ల రూపాయలతో గ్రానైట్ రాతి యాగశాలను నిర్మించడానికి శంకుస్థాపన చేశారని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.

అలాగే ప్రైవేటు భాగస్వామ్యంతో 33 కోట్ల రూపాయలతో కనకదుర్గ నగర్ లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.ఈ నిర్మాణ పనులు అన్నిటిని సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
అలాగే దేవాలయ పాలకమండలి కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, హోం మంత్రి వనిత, దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్( Vellampalli Srinivas ) ఉన్నట్లు సమాచారం.
LATEST NEWS - TELUGU