ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.24
సూర్యాస్తమయం: సాయంత్రం.6.27
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: మ.12.25 ల1.45
దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36
మేషం:

ఈరోజు విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.కొందరు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
వృషభం:

ఈరోజు ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.దీర్ఘ కాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
మిథునం:

ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి.బందు మిత్రులతో మిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి.దైవ చింతన పెరుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
కర్కాటకం:

ఈరోజు స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి.గృహమున సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహం:

ఈరోజు బంధువులు, మిత్రుల నుంచి రుణాల ఒత్తిడులు అధికమవుతాయి.దూర ప్రయాణం సూచనలు ఉన్నవి.ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం అవుతుంది.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.
కన్య:

ఈరోజు ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతుంది.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి.
తుల:

ఈరోజు మాతృ వర్గ బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి.చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమౌతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.
వృశ్చికం:

ఈరోజు ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
ధనుస్సు:

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది.ప్రయాణాలు వాయిదా పడతాయి.చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
మకరం:

ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి.గృహమును కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
కుంభం:

ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.ముఖ్యమైన వ్యవహారాలలో ఎంతో శ్రమపడ్డారు ఫలితం కనిపించదు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.
మీనం:

ఈరోజు మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి.
కుటుంబంలో వాతావరణం గందరగోళంగా ఉంటుంది.వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.
దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.