1.హైదరాబాదులో పోలీసుల ఆంక్షలు
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నేటి నుంచి ఈ నెల 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
2.బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఆగ్రహం

ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ నాయకులు ఎందుకు బహిష్కరించారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) ప్రశ్నించారు.
3.రాజశేఖర్ రెడ్డి జయంతి.జగన్ సందేశం

ఈరోజు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు.మీ జయంతి మా అందరికీ ఒక పండుగ రోజని జగన్( CM jagan ) ట్వీట్ చేశారు.
4.నేడు గుంటూరులో నాదెండ్ల మనోహర్ పర్యటన
గుంటూరులో జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు.గుంటూరు ఛానల్ పనులకు నిధులు మంజూరు చేయాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో 11వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో మనోహర్ వారికి మద్దతు పలకనున్నారు.
5.తెలంగాణకు ప్రధాని

భారత ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi )ఈరోజు తెలంగాణకు చేరుకున్నా రు.వరంగల్ లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.
6.వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి భార్య విజయలక్ష్మి, కుమార్తె షర్మిల, కుమారుడు వైయస్ జగన్ నివాళులు అర్పించారు.
7.ప్రధాని పర్యటనకు కేసిఆర్ దూరం

భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు .మోది కి స్వాగతం పలికేందుకు కేసిఆర్ రావాల్సి ఉన్న ఆయన స్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.
8.అనంతపురం జిల్లాలో జగన్ పర్యటన
వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.వైయస్సార్ రైతు దినోత్సవం లో జగన్ పాల్గొని ఖరీఫ్ భీమా పరిహారాన్ని అందజేయనున్నారు.
9.బంగాళాఖాతంలో వాయుగుండం
ఉత్తర మధ్య బంగాళాఖాతంపై ఆవర్తనం కొనసాగుతోంది.నేడు రేపు తెలంగాణతో పాటు, ఏపీలోనూ ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
10. తెలంగాణ బిజెపి ఎన్నికల ఇన్చార్జిగా.
తెలంగాణ బిజెపి ఎన్నికల ఇన్చార్జిగా ప్రకాష్ జవదేకర్ నియమితులయ్యారు.ప్రస్తుతం ప్రధాన నరేంద్ర మోడీ వరంగల్ ఆయన పర్యవేక్షించారు.
11.దుర్గమ్మకు శ్రీశైలం నుంచి ఆషాడసారె
విజయవాడ కనకదుర్గమ్మ కు శ్రీశైలం నుంచి ఆషాడ సారె అందింది .ఉదయం ఎనిమిది గంటలకు సాయంత్రం శ్రీశైలం దేవస్థానం సమర్పించింది.
12.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నాయకులు, ప్రజలు ఆయన జయంతి వేడుకలు చేయడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
13.జగన్ పై చంద్రబాబు విమర్శలు

ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ పడిపోయిందని పులివెందులలో జగన్ ఓటమి ఖాయం అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.
14.ప్రధాని రాతను నిరసిస్తూ…
భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో , ఆయన రాకను వ్యతిరేకిస్తూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.
15.తెలంగాణ పై నితిన్ గడ్కారీ కామెంట్స్

కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ( Nitin Gadkari ) అన్నారు.తెలంగాణలో 1.10 లక్షల కోట్ల ప్రాజెక్టులు చేపట్టామని నితిన్ గట్కారి అన్నారు.
16.కెసిఆర్ ది అవినీతి ప్రభుత్వం : మోది
తెలంగాణలో కెసిఆర్ ది అత్యంత అవినీతి ప్రభుత్వం అని భారత ప్రధాని నరేంద్ర మోది వరంగల్ సభలో విమర్శించారు.
17.క్షమాపణలు చెప్పిన ఆది పురుష్ రచయిత
ఆది పురుష్ రచయిత మనోజ్ ముంతాజ్ శుక్ల దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.ఆది పురుష్ తో బాధ పెట్టినందుకు క్షమించాలంటూ ఇన్ స్టా వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు.
18.పాడేరులో కాల్పులు కలకలం
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పాడేరు మండలం దేవాపురం కొత్తూరులో నాటు తుపాకీ పేలి ఓ గిరిజనుడు మృతి చెందడం కలకలం వేపుతోంది.
19.జెసి ప్రభాకర్ రెడ్డి గృహ నిర్బంధం
అనంతపురం జిల్లా తాడిపల్లి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
