వాట్సప్( Whatsapp ) తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.ఈ క్రమంలోనే వాట్సప్ లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఆ ఫీచర్ ఏమిటంటే.వాట్సప్ క్రాస్ పోస్టింగ్ ఫీచర్( WhatsApp cross posting feature ).క్రాస్ పోస్టింగ్ అంటే ఒక ప్లాట్ ఫామ్ లోని పోస్టులను మరో ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేయడాన్ని క్రాస్ పోస్టింగ్ అంటారు.ఈ క్రాస్ పోస్టింగ్ ఫీచర్ ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి యాప్స్ లలో అందుబాటులో ఉంది.

వాట్సప్ లోని స్టేటస్ అప్డేట్స్ ను ఇన్ స్టాగ్రామ్ ( Instagram )లో కూడా ఒకేసారి పోస్ట్ చేసుకునేందుకు వీలుగా ఈ క్రాస్ పోస్టింగ్ ఫీచర్ ను వాట్సప్ అందుబాటులోకి తీసుకురానుంది.ఇంస్టాగ్రామ్ స్టోరీలను ఫేస్ బుక్ లో స్టోరీలుగా ఎలా షేర్ చేస్తారో.వాట్సప్ స్టేటస్ లను కూడా ఇంస్టాగ్రామ్ లో స్టోరీలుగా పెట్టుకోవచ్చు.ఈ ఫీచర్ కంటెంట్ క్రియేటర్లకు చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది.

యూజర్లు ఏదైనా అప్డేట్ షేర్ చేయాలంటే ముందుగా వాట్సాప్ లో స్టేటస్ పెట్టి మళ్ళీ యాప్ నుంచి బయటకు వచ్చి ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లో సెపరేట్ గా పోస్ట్ చేసే పని లేకుండా అందుకే ఈ క్రాస్ పోస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది.ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడానికి ఇంస్టాగ్రామ్ లో ఒక కొత్త సెట్టింగ్ కూడా రాబోతుంది.ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండే ఈ క్రాస్ పోస్టింగ్ ఫీచర్ త్వరలోనే వాట్సప్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.అంతేకాదు యూజర్ నేమ్ సెర్చ్ ఫీచర్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది.







