2023 శ్రీరామనవమి పూజా శుభ ముహూర్తాలు ఇవే..

శ్రీరామనవమి( Sri Rama Navami ) హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ.లోకకళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసం మానవరూపంలో అవతరించిన శ్రీ మహావిష్ణువు( Shri Mahavishnu ) ఏడవ రూపమే శ్రీరాముడని పురాణాలలో ఉంది.

 These Are The Auspicious Moments Of Sri Ram Navami Puja 2023 ,sri Ram Navami, S-TeluguStop.com

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో, అభిజిత్ ముహూర్తంలో త్రేతాయుగంలో జన్మించాడు.రాముని జన్మదినం సందర్భంగా శ్రీరామనవమి పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

పదునాలుగు సంవత్సరముల వనవాసం,రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేక శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి రోజు జరిగిందని ప్రజల నమ్మకం.

ఇదే రోజున శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది.ఇంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీ రామనవమి హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ.హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం చైత్రమాసంలో అమావాస్య తర్వాత తొమ్మిదవ రోజున వచ్చే నవమిని శ్రీరామనవమిగా పిలుస్తారు.

ఈ సంవత్సరం అనగా 2023లో మార్చి 30వ తేదీన గురువారం రోజు శ్రీరామ నవమి నీ జరుపుకుంటారు.ఇదే రోజున చైత్ర నవరాత్రులు ముగుస్తాయి.

త్రేతాయుగంలో శ్రీ రాముడు చైత్ర శుద్ధ నవమి,గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడనీ పురాణాలు చెబుతున్నాయి.కాబట్టి దృక్ పంచాంగ్ ప్రకారం, శ్రీ రాముడు జన్మించిన తిధి ఈ ఏడాది మార్చి 30 ఉదయం 11.11 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:40 వరకు ఉంటుంది.అయితే నవమి తిథి మార్చి 29న రాత్రి 9 గంటల 7 నిమిషములకు ప్రారంభమై, మార్చి 30 రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే మన దేశ రాజధానిలో శ్రీరామ నవమి పూజ ముహూర్తం ఉదయం 11.11 నిమిషముల నుంచి మధ్యాహ్నం ఒకటి నలభై నిమిషాల వరకు ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube