ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.56
సూర్యాస్తమయం: సాయంత్రం 06.48
రాహుకాలం: మ.10.30 నుంచి 12.00 వరకు
అమృత ఘడియలు: సా.05.00 నుంచి 06.50 వరకు
దుర్ముహూర్తం: మ.03.21 నుంచి 04.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.
బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
వృషభం:
ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో అవసరమైన విషయాలకి వాదనలకు దిగకండి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మిథునం:
ఈరోజు మీరు విలువైన వస్తువుల కోల్పోయే అవకాశం ఉంది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.మీ పాత స్నేహితులు ఈ రోజు మిమ్మల్ని కలుస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు బాగానే ఉంటుంది.
సింహం:
ఈరోజు మీకు కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వారితో చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.తోటి వారి సహాయం మీకు ఎప్పుడూ అందుతుంది.
కన్య:
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఈరోజు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మిమ్మల్ని ఎంతో ఆనంద పరుస్తుంది.ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
తులా:
ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.వ్యవసాయదారులు ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు.స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.
వృశ్చికం:
ఈరోజు మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే సోమత మీలో ఉంటుంది.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.
ధనస్సు:
ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా మంచిది.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.మీ ఇంటికి ఈరోజు అనుకోకుండా బంధువులు వస్తారు.
మకరం:
ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కొన్ని వ్యక్తిగత విషయాలు మీ తోబుట్టువులతో పంచుకోండి.స్నేహితుల వలన కొన్ని సమస్యల నుండి బయట పడతారు.ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుంభం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు ఏ పని మొదలు పెట్టిన నిదానంగా పూర్తి చేస్తారు.
మీనం:
ఈరోజు విద్యార్థులకు విదేశాలకు వెళ్లే ఆలోచనలు ఉంటాయి.కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వారి సహాయంతో మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
LATEST NEWS - TELUGU