ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.అలాగే తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంటుంది.
అలాగే ప్రతి బుధవారం రోజు బెల్లంతో తయారుచేసిన బెల్లం పాయసంను( Jaggery Payasam ) స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.మంగళవారం రోజు స్వామివారిని దాదాపు 63,000 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఇంకా చెప్పాలంటే స్వామివారికి 25,340 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించగా, దాదాపు మూడు కోట్ల 45 లక్షల రూపాయలు భక్తులు స్వామి వారికి హుండీ ద్వారా కానుకలను సమర్పించారు.ఇంకా చెప్పాలంటే సర్వదర్శనం భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్( Vaikuntha Q Complex ) లో ఒక కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు.
టైం స్లాట్ టోకెన్లు ( Time slot tokens )లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది.ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం మాత్రమే పట్టింది.

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహించారు.ఇందులో భాగంగా బుధవారం రోజు ప్రత్యూషకాల ఆరాధనతో దేవాలయ ద్వారములను అర్చకులు తెరిచారు.అలాగే శ్రీ వెంకటేశ్వర సుప్రభాత సూత్రంతో స్వామివారిని మేల్కొల్పారు.సన్నిధిలో శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన తర్వాత సర్కారు హారతి అందించి v i p భక్తులను స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు.
ఆ తర్వాత స్వామివారికి రెండవ గంట నివేదన, బలి జరిపిన తర్వాత ప్రతి బుధవారం రోజు నిర్వహించే సహస్ర కళషాభిషేకమును( Sahasra Kalashabhishekam ) తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

ఉత్సవ విగ్రహాల పరిరక్షణ నేపథ్యంలో సంవత్సరంలో ఒక రోజు మాత్రమే నిర్వహించాలని ఆగమ సలహాదారుల మండలి సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.ఆ తర్వాత సర్వదర్శనం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవంను నేత్ర పర్వంగా నిర్వహిస్తారు.