ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నేడు కీలక సమావేశం జరగనుంది.ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో ఈ మీటింగ్ నిర్వహించనున్నారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఏపీ తరపున ఉన్నతాధికారులు ఎస్.ఎస్.రావత్, ప్రేమ్ చంద్రారెడ్డి, ఆదిత్యనాథ్ దాస్ లు హాజరుకానున్నారు.అటు తెలంగాణ నుంచి రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ ఈ మీటింగ్ లో పాల్గొంటారు.
కాగా ఏపీ భవన్ విభజనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఏపీ, తెలంగాణ విడిపోయి దాదాపు పదేళ్లు గడుస్తుండగా.ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్ లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.







