ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతికి ఉన్న‌ టాటూని గమనించారా? ..దాని అర్ధం ఏంటి ?

ఇప్పుడు అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటిస్తున్న ఓజి.ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ కనిపిస్తాడని తెలియడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.

 Did You Know About This Tatto From Pawan Kalyan Hand, Pawan Kalyan, Pawan Kalyan-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.సాహో తరువాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.ఇక సుజిత్( Sujith ) పవన్ కళ్యాణ్ కి అభిమాని కావడంతో పవన్ కళ్యాణ్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడని అందరు ఎదురుచూస్తున్నారు.పవన్ కళ్యాణ్ కి జోడిగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో పవన్ ఫేస్ ని చూపిస్తూ పోస్టర్స్ ని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు.

అయితే ఒక పోస్టర్ లో మాత్రం పవన్ కళ్యాణ్ గన్ పట్టుకొని ఉన్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది.అయితే ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ చేతిపై ఉన్న టాటూపై( tattoo ) అందరి కళ్ళు పడ్డాయి.

అసలు ఆ టాటూకి అర్థం ఏంటి అని అందరు సెర్చ్ చేయడం మొదలెట్టారు.

Telugu Tattopawan, Og, Pawan Kalyan, Pawankalyan, Priyanka Mohan, Sujith, Tattoo

పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇప్పుడు భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఓజి.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న ఈ మూవీ గ్లింప్స్ లేదా టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ టీజర్ కట్ 70 సెకండ్లు ఉంటుందని సమాచారం.

ఈ టీజర్ కి అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ యాడ్ చేస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే తాజగా ఈ సినిమా టీం ఫస్ట్ లుక్ లేదు అంటూ ఆకలితో ఉన్న చిరుత కోసం వెయిట్ చేద్దాం అని ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Telugu Tattopawan, Og, Pawan Kalyan, Pawankalyan, Priyanka Mohan, Sujith, Tattoo

ఈ పోస్టర్ లో గన్ పట్టుకున్న పవన్ చేతి పై ఒక టాటూ కనిపిస్తోంది.ఇక ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటారా.అసలు ఆ టాటూ అర్ధం ఏమిటా అని నెటిజెన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.

అయితే తాజాగా ఈ టాటూకు అర్ధం ఫైర్ పవర్ అని ఒక ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే ఆ టాటూకి అర్థం ఏమిటో త్వరలో రిలీజ్ అయ్యే వీడియోల్లో తెలియనుంది.

సెప్టెంబర్ 2 కోసం ఫ్యాన్స్, సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube