ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతికి ఉన్న‌ టాటూని గమనించారా? ..దాని అర్ధం ఏంటి ?

ఇప్పుడు అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటిస్తున్న ఓజి.

ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ కనిపిస్తాడని తెలియడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.సాహో తరువాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

ఇక సుజిత్( Sujith ) పవన్ కళ్యాణ్ కి అభిమాని కావడంతో పవన్ కళ్యాణ్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడని అందరు ఎదురుచూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కి జోడిగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమాలో పవన్ ఫేస్ ని చూపిస్తూ పోస్టర్స్ ని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు.

అయితే ఒక పోస్టర్ లో మాత్రం పవన్ కళ్యాణ్ గన్ పట్టుకొని ఉన్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది.

అయితే ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ చేతిపై ఉన్న టాటూపై( Tattoo ) అందరి కళ్ళు పడ్డాయి.

అసలు ఆ టాటూకి అర్థం ఏంటి అని అందరు సెర్చ్ చేయడం మొదలెట్టారు.

"""/" / పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇప్పుడు భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఓజి.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న ఈ మూవీ గ్లింప్స్ లేదా టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ టీజర్ కట్ 70 సెకండ్లు ఉంటుందని సమాచారం.ఈ టీజర్ కి అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ యాడ్ చేస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే తాజగా ఈ సినిమా టీం ఫస్ట్ లుక్ లేదు అంటూ ఆకలితో ఉన్న చిరుత కోసం వెయిట్ చేద్దాం అని ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. """/" / ఈ పోస్టర్ లో గన్ పట్టుకున్న పవన్ చేతి పై ఒక టాటూ కనిపిస్తోంది.

ఇక ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటారా.అసలు ఆ టాటూ అర్ధం ఏమిటా అని నెటిజెన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.

అయితే తాజాగా ఈ టాటూకు అర్ధం ఫైర్ పవర్ అని ఒక ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే ఆ టాటూకి అర్థం ఏమిటో త్వరలో రిలీజ్ అయ్యే వీడియోల్లో తెలియనుంది.

సెప్టెంబర్ 2 కోసం ఫ్యాన్స్, సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.