జనాలను కష్టాల నుంచి కాస్త వినోదం వైపు దారిమల్లించే సాధనాలు.సినిమా, టీవీ.
కానీ కరోనా దెబ్బ అన్ని రంగాలతో పాటూ వీటిని వదల్లేదు.జనాలకు వినోదాన్ని పంచే వారి జీవితాలను అతలా కుతలం చేసింది ఈ మహమ్మారి.
సినిమా షూటింగులు ఆగిపోయాయి.సినిమాల రిలీజ్ నిలిచిపోయింది.
థియేటర్ ముందు పోస్టర్లు లేవు.థియేటర్లో సినిమాలూ లేవు.
ఒకప్పుడు జనాలతో కిక్కిరిసిన సినిమా థియేటర్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.కరోనా కాస్త కుదుట పడినా సినిమా రంగం మాత్రం పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు.
అంతేకాదు.కరోనాకు ముందు సినిమా వేడుకలు ఓరేంజిలో జరిగేవి.ప్రీరిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, సక్సెస్ మీట్లు. ఒకటేమిటీ ఎన్నో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగేవి.
జనాలు ఈ కార్యక్రమాలను చూడ్డానికి తండోపతండాలుగా తరలి వచ్చేవారు.కాపీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
కేవలం అతికొద్ది మందిని మాత్రమే ఆయా వేడుకలకు పిలుస్తున్నారు.మీడియా కవరేజీ ద్వారా ఏదో జరిపామా? అంటే జరిపాం.అనేలా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
అటు సైమా, ఐఫా ఇంకా ఏవేవో పేర్లతో అవార్డుల వేడుకలు జరిపేవారు.
సినిమా తారలంతా ఒక చోట చేరి కనువిందు చేసేవారు.సంతోషం అవార్డులు అంటూ ఒక చోట చేరి జనాలకు సంతోషాన్ని పంపేవారు.
హైదరాబాద్ లో ఒకప్పుడు అద్భుత వేడుకలకు కేరాఫ్ గా ఉండేది.శని, ఆది వారాల్లో ఏదో ఒక ప్రోగ్రాం పేరుతో తెగ హడావిడి జరిగేది.కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.వేడుకలు అంటేనే జనం భయపడిపోతున్నారు.సినిమా తారలు సైతం ఇంతకు ముందుగా బయట స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు.కార్యక్రమాలకు, వేడుకలకు ఇంకా దూరంగానే ఉన్నారు.
ఏదో సినిమా షూటింగులకు వెళ్లామా? వచ్చామా? అన్నట్లుగానే ఉంటున్నారు.అటు టీవీ తారల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
ఒకప్పుడు పెద్ద పెద్ద కార్యక్రమాలను నిర్వహించిన టీవీ చానెల్స్.ప్రస్తుతం వాటన్నింటికీ దూరంగా ఉంటున్నాయి.
కేవలం వినోద కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రసారం చేస్తున్నాయి.