ముఖ చర్మ రంగు అంతా ఒకేలా ఉండాలంటే నిమ్మ ఫేస్ ప్యాక్స్

మనం సాధారణంగా ముఖం కాంతివంతంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం.అలాగే ఖరీదైన కాస్మోటిక్స్ కూడా వాడుతూ ఉంటాం.

 Lemon Face Packs For Clearer Brighter Skin Details, Lemon Face Packs, Face Pack-TeluguStop.com

అయినా పెద్దగా ఉపయోగం కనపడదు.అంతేకాక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి.

అయితే ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే నిమ్మరసంతో కొన్ని ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే ముఖ చర్మం అంతా ఒకే రీతిలో ఒకే రంగులో ఉంటుంది.ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ కలబంద జ్యూస్ లో ఒక గుడ్డు తెల్లసొన, ఒక స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆ తరవాత ముఖానికి మాయిశ్చరైజర్ రాయాలి.

రెండు స్పూన్ల నిమ్మరసంలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక స్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ నిమ్మరసం ,చిటికెడు ఆరెంజ్ తొక్కల పొడి వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత లైట్ స్కిన్ టోనర్ రాస్తే మంచి ఫలితం కనపడుతుంది.

Lemon Face Packs For Clearer Brighter Skin Details, Lemon Face Packs, Face Pack, Skin Tone,Skin Care Tips In Telugu, Alovera, Egg White, Skin Care Tips, Honey, Telugu Health Tips - Telugu Alovera, Egg White, Face Pack, Honey, Lemon Face, Skin Care Tips, Skincare, Skin Tone, Telugu Tips

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube